బహుజన సాహిత్య అకాడమీ (బీ.ఎస్. ఏ) నేషనల్ కమిటీ అఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే అవార్డుల వేడుకలలో భాగంగా, 17వ నేషనల్ కాన్ఫరెన్స్ ది. 15-12-2024 న లోధీ రోడ్ న్యూఢిల్లీలో బీఎస్ ఏ, జాతీయ అవార్డుల కమిటీ శ్రీ రమేష్ కుమార్ నుండి శ్రీ నల్లా సురేష్ రెడ్డి కి ఫోన్ కాల్ మెసేజ్ ఇస్తూ మీరు గత ఎనిమిది సంవత్సారాలుగా ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలను గుర్తించి మా స్థానిక బృందం ద్వారా మీ వివరాలను సేకరించి మీ నామినేషన్ ను పరిశీలించి, మిమ్నల్ని మేము అనగా (బీ.ఎస్. ఏ) మా జాతీయ కమిటీ వారు డాక్టర్ ఏపీజే. అబ్దుల్ కలాం నేషనల్ అవార్డ్ సామాజిక సేవ కేటగిరీ లో రికమెండ్ చేసాం అని తెలియచేసారు.
శ్రీ. *సురేష్ రెడ్డి గత ఎనిమిది సంవత్సరాలుగా చేసిన సేవలలో కొన్ని కమిటీ వారు క్షుణ్ణంగా పరిశీలించారు. *కోవిడ్ సమయంలో 2020-2021 రెండు సంవత్సరాలు శ్యామలా గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ పేరుపై మారు మూల గిరిజన తండాలలో, పల్లెల్లో నిత్యావసర సరుకులు, మెడిసిన్స్, బట్టలు, శాని టైజర్స్, నోస్ మాస్క్ లు అందించారు. అలాగే కోవిడ్ వ్యాధి గ్రస్తులకు సేవలను అందించారు
ఎందరో పేద విద్యార్థులకు ఫీజులు, బుక్స్, నూతన వస్త్రాలు, బస్సు చార్జెస్ చెల్లించడం, అనేక గుప్త దానాలు చేయడం, పెద్దమ్మ తల్లి గుడి వద్ద నూతన శివాలయం నిర్మాణం పూర్తి చేయడం, గుడి పాడు గ్రామం లోని కాకతీయుల కాలం నాటి శ్రీ శ్రీ శ్రీ మోక్ష వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం పునః నిర్మాణం, పాల్వంచ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీడియా వారికీ ప్రెస్ క్లబ్ నిర్మించి ఆగస్టు 2024 లో రెవెన్యూ మినిస్టర్ గారిచే స్థానిక ఎమ్మెల్యే ఇతర ప్రముఖుల సమక్షంలో ప్రారంభోతవం చెయ్యడం జరిగింది.
అలాగే సీతానగర్ కాలనీ నందు ఒక దివ్యంగునికి ఆర్టి ఫిషియల్ లెగ్ ఏర్పాటు, అలాగే ప్రతి సంవత్సరం డాక్టర్ శ్యామలా గోపాలన్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఎన్నో రకాల సేవలు రెడ్ క్రాస్ వారి సహాయంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు, కంటి, పంటి పరీక్షలు చేసి వారికి కళ్లద్దాలను, దంత మార్పిడులను చేయించడం, దివ్యంగులకు ట్రైసైకిల్స్ ని అందించడం ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. పాల్వంచ సోములగూడెం లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఏర్పడి 50 వసంతాలు పూర్తి అయిన సందర్భం గా
కాలేజ్ అభ్యర్ధన మేరకు బిల్డింగ్స్ అన్నిటికి నూతన కలర్ పెయింట్స్ వేయించడం, ఇలాంటి విషయాలను అన్నియు “బహుజన సాహిత్య అకాడమీ” వారు పరిశీలించి, గుర్తించి *శ్రీ సురేష్ రెడ్డి * చేసిన సేవలను అకాడమీ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో పొందుపరచి,
శ్రీ నల్లా సురేష్ రెడ్డి ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ అవార్డుకు “సామాజిక సేవ” క్యాటగిరీ నుండి జాతీయ అవార్డు గ్రహీతగా ప్రకటించారు.
కొన్ని అనివార్య కారణాల వలన శ్రీ సురేష్ రెడ్డి ది. 05.01.2025 న ఈ అవార్డును శ్రీ సుందరయ్య విజ్ఞాన భవనం, హైదరాబాద్ లో జాతీయ కమిటీ వారి వద్ద నుండి అందుకోలేక పోయారు.
అందులకు బి ఎస్ ఏ స్థానిక కమిటీ తరపున బి ఎన్ రమేష్ కుమార్ హైదరాబాద్ నుండి అవార్డు, మరియు ప్రశంస పత్రం ను వారియొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా బి ఎస్ ఏ, నాయకులు శ్రీ ఆలువాల ప్రనీత్, సందీప్, రామ్ కిషోర్ ల ద్వారా పాల్వంచకి పంపిస్తున్నాను, మీరు అవార్డును స్వీకరించమని ఫోన్ ద్వారా వారు విలువైన సందేశం ఇచ్చారు, అందులకు శ్రీ సురేష్ రెడ్డి కమిటీ వారి సూచనను గౌరవిస్తూ ఈరోజు అవార్డును వారి స్వగృహంలో కమిటీ వారినుండి స్వీకరించారు.
సురేష్ రెడ్డి జాతీయ కమిటీ వారికీ, స్థానిక కమిటీ వారికి ధన్య వాదములు తెలియచేస్తూ ఈ అవార్డు తనకు మరెన్నో బాధ్యతలను పెంచిందని ఇంకా మెరుగైన సేవలను పేద ప్రజల కోసం చేస్తానని చెప్తూ జాతీయ కమిటీ, స్థానిక కమిటీ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వెదిరే రామకృష్ణా రెడ్డి, గడ్డం రవీందర్ రెడ్డి, కొడుపుగంటి శ్రీనివాస్, రావుల శివ, రావుల కృష్ణ, ఆరెం ప్రశాంత్, అశోక్ రెడ్డి, పెండ్లి రామిరెడ్డి, విజయ్ కుమార్, సూర్య, మల్లేష్, సందీప్, వీరన్న, మోతీర్, విజయ్, రామ్ కిషోర్, ఆదాం, ఫణి, దాస్, బాబులాల్ మరియు ఇతరులు.