
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 25(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండల కేంద్రం లోని బుగ్గ రోడ్డు నందు గల మోడల్ ప్రైమరీ స్కూల్ నంబర్ 4 పాఠశాల ఆవరణం నందు భరత మాత ముద్దు బిడ్డ మిసైల్ మ్యాన్ , మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ ఎ. పి. జె. అబ్దుల్ కలామ్ గారి నిలువెత్తు విగ్రహం ఏర్పాటు కొరకు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు జూటూరు అబ్దుల్ రజాక్ గారి స్వంత నిధుల తో ఈ రోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడము జరిగింది. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ అన్నదానము తో పాటు విద్యా దానము కూడ చాలా గొప్పది,అన్నము అప్పటికి కడుపు నింపి ఆకలి తీర్చుతుంది.అదే విధంగా విద్యా దానం చేస్తే బాగా చదువు కొని తన తో పాటు అటు కుటుంబానికి, ఇటు సమాజానికి కూడ చేయూత ఇవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కావున ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మీకు తగినంత ఆర్థికంగా ఆదుకొని వారికి విద్యా సామాగ్రి అందించాలని కోరారు. ఈ సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన విగ్రహ దాత అబ్దుల్ రజాక్ కు పాఠశాల ఉపాద్యాయబృందము, పాఠశాల కమిటీ, తల్లితండ్రులు, పిల్లలు, కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.
