
పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
వైద్య రగంలో విశేష సేవలు అందిస్తున్న రాందేవ్ రావు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కమలాకర్ రావు కు బిగ్గెస్ట్ డాక్టర్ అవార్డు ఇరవై ఐదు లభించింది. ఈ అవార్డు ఫంక్షన్ హైటెక్స్ జరిగింది. డాక్టర్ కమలాకర్ రావు సారాధ్యంలో రాందేవ్ రావు హస్పిటల్ హాస్పిటల్ లో సేవలందిస్తున్న ఐదు విభాగాల డాక్టర్ల కు కూడా అవార్డులు లభించాయి. డాక్టర్ కమలాకర్ రావు యాబై రెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందించడంతో పాటు గతంలో రక్షణ రంగంలో పనిచేశారు. డాక్టర్ కమలాకర్ కు బిగ్గెస్ట్ డాక్టర్స్ అవార్డు కు ఎంపిక కావడం పట్ల రామ్ దేవ్ రావు ఆసుపత్రి సీఈవో డాక్టర్ యోబుతోపాటు ఇతర డాక్టర్ల బృందం సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. రాందేవ్ రావ్ ఆసుపత్రిలో గైనకాలజీ విభాగంలో సేవలందిస్తున్న ప్రొఫెసర్ కే ఛాయాదేవి (గైనకాలజిస్ట్), డాక్టర్ రవికుమార్ సుంకర, డాక్టర్ రాజేష్ సుంకర, డాక్టర్ సూర్య కళ లకు కూడా డాక్టర్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాందేవ్ ఆసుపత్రి యాజమాన్యం తరపున మీరా రావు, అపర్ణ రావు, ప్రశాంత్ రెడ్డి, ధనరావు డాక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేసినట్లు రాందేవ్ ఆసుపత్రి సీఈవో డాక్టర్ యోబు తెలిపారు.
