
సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, ఘాటు వ్యాఖ్యలు
పయనించే సూర్యుడు మార్చి 23 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
నియోజకవర్గాల పునర్వి భజనకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలతో పాటు నష్టపోయే ఇతర రాష్ట్రాల హక్కులను కాపాడుకునే క్రమంలో రెండో సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది పునర్విభజన సంబంధించి చెన్నైలో శనివారం నిర్వహించిన సదస్సు ఈ మేరకు తీర్మానించింది, సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పునర్విభజనలో నష్టం పోనున్న రాష్ట్రాల ప్రజల అభిమాతానికి అనుగు ణంగా రెండవ సదస్సు హైదరాబాదులో నిర్వహి స్తామని, అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహిస్తా మని ఆయన అన్నారు. ప్రస్తుత జనాభా ప్రాతిపది కన లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభజనతో తమకు అన్యాయం జరుగు తుందంటున్న దక్షిణాది రాష్ట్రాలు తమ వాణిని బలంగా వినిపించేందుకు ఉమ్మడి కార్యాచరణకు దిగాయి. ఈ దిశగా తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో శనివారం చెన్నైలో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ప్రారంభ మైంది. ఈ సదస్సుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్దితో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత కేటీఆర్ పాల్గొన్నారు.ఈ సభలో ప్రసంగించిన సీఎం స్టాలిన్.. నియోజకవర్గ పునర్విభజన న్యాయ బద్ధంగా జరిగే వరకూ తమ పోరాటం ఆగదని అన్నారు. ప్రస్తుత జనాభా ప్రాతి పదికన నియోజకవర్గ పునర్విభజన జరగకూ డదు. మనం దీన్ని గట్టిగా వ్యతిరేకించాలి. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రజాప్రతినిధుల సంఖ్య తగ్గితే మన వాణిని వినిపించే శక్తి కూడా తగ్గిపోతుంది అని స్టాలిన్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలో పేతం చేసే ఏ చర్యను మేము వ్యతిరేకించట్లేదు. ఇది న్యాయమైన రాజకీయ ప్రాతినిధ్యాన్ని ప్రభావితం చేయకూడదు. ఈ నిరసన నియోజకపునర్విభజనకు వ్యతిరేకంగా కాదు న్యా యబద్ధంగా పునర్విభజన జరగాలి అని ఆయన అన్నారు.
ఈ మీటింగ్‌లో మొత్తం ఐదు రాష్ట్రాలకు చెందిన 14 రాష్ట్రాల రాజకీయ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ నేతలతో పాటు పంజాబ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, శిరోమణి అకాళీదళ్ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.