
గ్రామీణ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలని కల్పించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి.
//పయనించే సూర్యుడు// జులై16//మక్తల్ రూరల్
ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలి. సింగిల్ టీచర్ వ్యవస్థను రద్దు చేయాలి.మక్తల్ మండలంలోని భగవాన్ పల్లి, చిన్న గోపులాపూర్ కొత్తపారేవుల,పాత పారేవుల,దాదాన్ పల్లి,ముస్లయ్ పల్లి,అంకెన్ పల్లి,కొండదొడ్డి,సింగిల్ టీచర్ ఉన్నందున, ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులను వెంటనే ఇవ్వాలి -317 జీవో బాధితుల మానసిక క్షోభను ప్రభుత్వo పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలి.సమస్యను సమూలంగా పరిష్కరించాలి. -పెండింగ్లో ఉన్న డి ఏ లను, పిఆర్సి ని వెంటనే ప్రకటించాలి. -ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలను, సైన్స్ ల్యాబ్స్ ను పరిపుష్టం చేయాలి. -నూతనంగా ప్రభుత్వం ప్రకటించిన పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలి. -అనుగొండ హై స్కూల్ లో, తరగతి గదుల కొరతను వెంటనే పరిష్కరించాలి.నూతన పాఠశాల భవనాన్ని నిర్మించాలి. -పెండింగ్లో ఉన్న అన్ని DA లను, ప్రకటించాలి. నూతన పిఆర్సి ని వెంటనే అమలు చేయాలి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండు బడ్జెట్లోనూ 7.5 శాతం మాత్రమే నిధులను ప్రకటించింది. తన ఎన్నికల హామీల్లో మాత్రం 15% నిధులను ఇస్తామని ప్రకటించిoది. 15% నిధులను అనే మాటను వెంటనే ఆచరణలోకి తీసుకురావాలని విద్యారంగానికి సరిపడా నిధులను సమకూర్చి పాఠశాల విద్యను పరిపుష్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాకుండా గ్రామాల్లో నెలకొన్న చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నది.మౌలిక సదుపాయాల కొరత ఉన్నది. తరగతి గదులు, టాయిలెట్స్ కొరత,వంటి సమస్యలతో కునా రిల్లుతున్నాయి వీటన్నిటిని ప్రభుత్వం వెంటనే పరిగణలోకి తీసుకుని, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని, విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూనే, దానికి సమాంతరంగానే ప్రైవేట్ పాఠశాలలపై కూడా నియంత్రణను విధించాలి. మక్తల్ మండలంలోని భగవాన్ పల్లి, చిన్న గోపులాపూర్ కొత్తపారేవుల,పాత పారేవుల,దాదాన్ పల్లి,ముస్లయ్ పల్లి,అంకెన్ పల్లి,కొండదొడ్డి,పంచదేవ్ పాడ్ వంటి గ్రామాల బడుల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడే ఉపాధ్యాయులను ఇవ్వాలి.
UPS ముస్లయ్ పల్లి లో ,పోస్టుల సంఖ్యను పెంచాలి. ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాన్ని బలోపేతం చేయాలి. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు సైన్సు ల్యాబ్స్ ను కూడా తప్పనిసరిగా పాఠశాల ఏర్పాటు చేయాలి, 317 జీవో బారిన పడి, మానసిక క్షోబను అనుభవిస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితిని ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించి, ఆ సమస్యను సమూలంగా పరిష్కరించాలి. ఉపాధ్యాయుల బదిలీలను పదోన్నతులకు కూడా వెంటనే షెడ్యూల్ ప్రకటించి నిర్వహించాలని.విద్యారంగంలో నెలకొన్న సమస్యలన్నిటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని DTF గా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ సభ్యత్వ నమోదు ప్రచారంలో DTF జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యచంద్ర. జిల్లా అధ్యక్షురాలు హైమావతి. రాష్ట్ర కౌన్సిలర్ పరంధాములు, సీనియర్ నాయకులు వై చంద్రశేఖర్ పాల్గొన్నారు.
