
పైనుంచి సూర్యుడు న్యూస్ //ఆగస్టు 11// నారాయణపేట జిల్లా బ్యూరో //
సోమవారం రోజున ప్రగతి శీల యువజన సంఘం పీవై ఎల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి మత్తు మద్యపానం.గ్రామాల్లో మద్యపానం నుండి యువత భవిష్యత్తును కాపాడుకుందాం నారాయణపేట అంబేద్కర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ నర్సిరెడ్డి,చౌరస్తారావరకు పెద్ద ఎత్తున దాదాపుగా 80 బైకుల ర్యాలీ జరిగింది
J. రాము జిల్లా సహాయ కార్యదర్శి అధ్యక్షతన ముఖ్య ముఖ్య అతిథులు గా, ప్రగతిశీల యువజన సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దింటి.రామకృష్ణ . ప్రగతిశీల యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ప్రతాప్ మాట్లాడుతూ యువతా డ్రగ్స్, గంజాయి మత్తు ఉచ్చులో వెళ్లకూడదని నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి యువతా మేలుకో డ్రగ్స్, గంజాయి, మద్యం, గుట్కాలు మనకు వద్దు దూరంగా ఉండు ఆరోగ్యానికి దగ్గరగా ఉందాం అని వారు యువతకు పిలుపు ఇస్తూ అలాగే యువతకు ఉద్యోగ , ఉపాధి అవకాశాలు లేకపోవడంతో చెడు వ్యసనాలు డ్రగ్స్, గంజాయి, మద్యం మత్తు పదార్థాలు సేవిస్తూ జీవితాలను, కుటుంబాలను కోల్పోతున్నారని అన్నారు. డ్రగ్స్, గంజాయి, మద్యం గ్రామీణ, పట్టణ ప్రాంతంలో ఏరులై పారుతున్నాయి. డ్రగ్స్, గంజాయిలు, మద్యం మత్తులో పడి యువత అత్యాచారాలకు, దొంగతనాలకు ఒడిగడుతున్నారు అని యువత భవిష్యత్తును కాపాడాలి, యువత డ్రగ్స్ ,గంజాయిలు, మద్యం మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని యువతను చైతన్యం నింపుతూ డ్రగ్స్, గంజాయి , మద్యం,గుట్కాల వంటి మత్తు పదార్థాల నుండి మన ఆరోగ్యాన్ని కుటుంబాన్ని కాపాడాలని యువతకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పీవై ఎల్ జిల్లా నాయకులు మధు.మహేష్.బాలకృష్ణ . తిరుమలేష్. శివ. ఎల్లప్ప. గణేష్. . బోయ రవి. బాలకృష్ణ. సలీం. కృష్ణ గణేష్. రాము శ్రీకాంత్.సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ మండల కార్యదర్శి నరసింహ. PDSU జిల్లా అధ్యక్షులు సాయికుమార్.పార్టీ టౌన్ కార్యదర్శి కెంచ్ నారాయణ. హాజీ . నారాయణ. అరుణోదయ జిల్లా అధ్యక్షుడు రాములు పాల్గొన్నారు.

