
పయనించే సూర్యుడు, నవంబర్ 03( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అవగాహనతో కూడిన ప్రత్యేక తనిఖీలను పోలీసు విభాగం నిర్వహించింది. ఎస్సై ఉపేంద్ర చారి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి మండలంలోని ప్రధాన రహదారులపై వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. ప్రజల ప్రాణ భద్రత కోసం ఈ తనిఖీలు నిరంతరం కొనసాగనున్నాయని ఆయన స్పష్టం చేశారు.డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా జరిగే ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.