
- మాజీ ఎంపీటీసీ జి. బలరాం రెడ్డి..
- పయనించే సూర్యుడు// న్యూస్// ఏప్రిల్ 9//మక్తల్
రబీ సీజన్ కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నప్పటికీ ఎక్కడా కూడా ధాన్యం కొనుగోలు చేయలేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎంపిటిసి జి.బలరాం రెడ్డి అన్నారు. రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం పేరుకే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుందన్నారు. కొనుగోళ్ళకు అవసరమైన గన్ని బ్యాగులు కూడా కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు చేరలేదన్నారు. దీంతో రైతులు కల్లాల్లో వడ్లను ఆరబోసుకొని దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆయన వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.