
సీసీ కెమెరాలు నిమిత్తం విరాళం ఇచ్చిన మాధవరం
పయనించే సూర్యుడు మార్చి ఒకటి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా వార్తావిశ్లేషణ.ఈరోజు గౌరవ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి “నేరాలను అరికట్టడంలో భాగంగా ప్రతి గ్రామం లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ” అనే పిలుపు మేరకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈస్ట్ మాధవరం గ్రామ పెద్దలు చిట్టి బాబు గారు 35,000/- రూపాయల చెక్కుని అందజేయడం జరిగింది. వారికి పోలీసు సురక్ష కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా కొన్ని గ్రామాలకు సంబంధించిన పెద్దలు,నాయకులు ముందుకు రావాలని, ఇది మీ యొక్క మండల మరియు గ్రామ రక్షణకు సంబంధించిన విషయం అని ప్రతి ఒక్కరూ గుర్తించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.