
పయనించే సూర్యుడు. పి. ఈశ్వరి.అక్టోబర్ 22 కళ్యాణదుర్గం డివిజన్. అనంతపురం జిల్లా.
రాయదుర్గం గ్రామ నివాసి పి లక్ష్మి దేవమ్మ W/0 లేట్ పి. చౌడప్ప. గారికి ఆరుగురు సంతానము. రాయదుర్గం పట్టణంలో పూర్వీకుల కాలం నుండి 8 సెంట్ల స్థలము వీరి స్వాధీనంభంలో ఉన్నది. లక్ష్మీదేవి అమ్మ కుమారులు ఇద్దరు ఉద్యోగస్తులైనందువలన సదరసలాన్ని కుమార్తెల పేరిట సగభాగము లక్ష్మీదేవి అమ్మ పేరిట 20×49 అడుగుల స్థలాన్ని స్వాధీనంలో పెట్టుకున్నది. ఆ స్థలంలో బేస్మెంట్ నిర్మాణం కూడా రాతి కట్టడంతో చేసుకున్నది. 2019 వ సంవత్సరంలో లక్ష్మీదేవి అమ్మగారు చనిపోయారు. అప్పటినుండి తిప్పే స్వామికి జేటి నాగవేనికి స్థలం పై కన్ను పడింది . ఎలాగైనా మొత్తం స్థలాన్ని కబ్జా చేయాలని తీవ్రంగా ప్రయత్నించారు. 2003 వ సంవత్సరంలో రాయదుర్గం మండల రెవెన్యూ అధికారి గారు తిప్పే స్వామికి పట్టా మంజూరు చేసినట్లుగా పొజిషన్ సర్టిఫికెట్ తయారు చేసుకున్నాడు. ఆ స్థలం తనదేనంటూ సర్వే నెంబరు 225 పట్టా ఫారంలో రాసుకొని హద్దులు రాసుకొని హైకోర్టు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయస్థానం లో తిప్పేస్వామి పెట్టుకున్న స్థలం విషయంపై కేసు పూర్వాపరాలు విచారించిన మీదట తిప్పే స్వామి సమర్పించిన పట్టా ఫారం సరిగా లేదని హైకోర్టు న్యాయస్థానం నుండి కేసు కొట్టివేశారు. తిప్పే స్వామి అతని భార్య జెటి నాగవేణి తప్పుడు ఆలోచనలతో తల్లికి చెల్లెళ్లకు రాయదుర్గం మండలం రెవెన్యూ అధికారులు మంజూరు చేసిన స్థలం సర్వే నంబర్ను తెలుసుకొని ఆ సర్వే నెంబరు 225 -A అని గుర్తించి, తిప్పేస్వామి చెందిన నకిలీ పట్టా ఫారంలో225-A అని దిద్దుకొని, తమ్మున్ని చెల్లెల్ల ను బెదిరించి స్థలాన్ని పూర్తిగా కబ్జా చేసి అమ్ముకున్నాడు. విషయం తెలుసుకున్న తమ్ముడు గంగాధర్ బాబు నలుగురు చెల్లెల్లు జరిగిన అన్యాయంపై రాయదుర్గం న్యాయస్థానాన్ని ఆశ్రయించినారు. తిప్పేస్వామి జెటి నాగమణి ఇద్దరూ కోర్టుకు వెళ్లిన విషయంపై తమ్మునిపై మరియు చెల్లెలపై విరుచుకుపడి నానా దృభాషలాడి మరియు రౌడీలతో ఫోన్లు చేయించి గంగాధర్ బాబుని తిట్టిస్తూ బెదిరించి గంగాధర బాబు పై స్టేషన్లో కేసు వేయించి నాడు. వాస్తవ పరిస్థితులు లాయర్ గారికి వినిపించి కోర్టులో తిప్పేస్వామి పై జేటి నాగవేణి పై జరిగిన అన్యాయాన్ని వాస్తవాలతో కోర్టుకు సమర్పించుకున్నారు. న్యాయస్థానం నుండి తిప్పే స్వామి జెడి నాగవేణికి సమన్లు జారీ చేసినారు కానీ జేడీ నాగమణి తిప్పేస్వామి ఇల్లు వదిలి కర్ణాటక కు పరారైనారు. కర్ణాటకలో చెల్లికేరి తాలూకాలోని చెల్లికేరి గ్రామానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేర్లగుంటే గ్రామంలో బాడుగ ఇంట్లో తలదాచుకున్నారు. వికలాంగునిగా నటించి తమ్ముడు పై కేసు పెట్టించిన తిప్పేస్వామికి నేర్లగుంటే కు దగ్గరలోనే ఉన్న డిఆర్డివో లో డిఫెన్స్ కు సంభందించిన కార్యాలయం లో పని చేయడానికి వెళ్ళినాడు. తిప్పే స్వామికి జేడీ నాగవేణికి అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లకి తగిన శిక్ష తప్పదని గ్రామ పెద్దలు కాలనీ ప్రజలు మీడియాకు తెలుపుకున్నారు వారి స్థలం వారికి వచ్చేవరకు వదిలిపెట్టమంటూ తిప్పేస్వామి నుండి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళని హెచ్చరించారు.