
జూన్ 21(పయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ : బాన్సువాడలోని కొటగల్లికి చెందిన షేక్ ఫర్హాన్ (9) అనే బాలుడు రుద్రూర్-బోధన రోడ్ లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా, బాలుడిని రుద్రూర్ ఎస్సై సాయన్న స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి భోజనం తినిపించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని తప్పిపోయిన బాలుడిని వాళ్ళ అమ్మమ్మకు క్షేమంగా అప్పగించారు. దింతో వారు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు.