
హరీష్ రావు, కవితను హెచ్చరించిన మానాల మోహన్ రెడ్డి (జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు )
పయనించే సూర్యుడు న్యూస్ నిజామాబాద్ జిల్లా బ్యూరో టి.కె గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు & రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి నిజామాబాదు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కెసిఆర్ పై మాట్లాడిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావ్,ఏమ్మెల్సీ కవిత గాని రేవంత్ రెడ్డి పై వాడిన భాషను తీవ్రంగా ఖండించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి ఇదే విదంగా కొనసాగుతె ఇంకోదిగా ముందుకు వెళ్లే పరిస్థితి అంటే మార్చురికి పోయే పద్ధతిలో మాట్లాడారు.రేవంత్ రెడ్డి చెప్పిన సామెతలు బహుశా హరీష్ రావు గానీ, కవితకు గాని పల్లెటూరులో వాడే సామెతలు తెలవవు.సాధారణంగా పల్లెటూరులలో ఊరుకి దూరం అవుతున్నావ్ కాటికి దెగ్గర అవుతున్నవ్ అనే సామెతను ఉదాహరణగా మాట్లాడకుంటారు.దీనే రేవంత్ రెడ్డి చావు అనే పదం బాగుండదని మార్చురి అని వాడారు. దీని అర్థం కెసిఆర్ కు మాత్రం తెలుసు. కానీ ఇవి తెలువని హరీష్ రావు ఎర్రి లేసిన కుక్క లాగా హరీష్ రావు మాట్లాడారు.ఈ రాష్ట్రము లో 14నెలల కాలంలో జరిగిన అభివృద్ధి గురించి గాని, సంక్షేమ పథకాలపై మీకు దమ్ము, దేర్యం ఉంటే అసెంబ్లీ వేదికగా మాట్లాడండి. అంతే కానీ మీ బామ్మరిదీ పైన, మీ మరదలు పైన ఆధిపత్యం కోసం నువ్వు చేసే వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు నిజముగా కెసిఆర్ ను మార్చురి కి పంపాలనుకుంటుంది ఎవరు బీజేపీ కోవర్ట్ గా కెసిఆర్ కొడుకును, కూతురును హింసిస్తే, ఆ హింసకు తట్టుకోలేక కెసిఆర్ చనిపోతే,ఆ బీజేపీ పార్టీని పట్టుకొని ఏదయితే తమిళనాడు లో జయలలిత పార్టీని ఎట్లయితే బీజేపీ చేరదీసిందో అట్లనే ఇక్కడ కూడా చేసే ఆలోచన హరీష్ రావుదని ఇవన్నీ కూడా ప్రజలు, పత్రికల్లో వస్తున్నవే తప్ప మా కాంగ్రెస్ పార్టీ అన్న మాటలు కాదని హరీష్ రావును విమర్శించారు.నిజంగా నీకు దమ్ము ఉంటే పిచ్చి కుక్క లాగా అరవకుండా, మీరు పాలించిన 10సంవత్సరాలలో అవినీతి పై కానీ మేము అధికారంలోకి వచ్చిన ఈ 14నెలల కాలంలో చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా వుండాలే తప్ప గుంట నక్క లాగా, పిచ్చి కుక్క లా మాట్లాడిన నీ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రాష్ట్రము లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిన్న అసెంబ్లీ లో గవర్నర్ ప్రసంగంలో ఈ రాష్ట్రము ఏ విధంగా ముందుకు వెళ్తుందో స్పష్టంగా తెలపడం జరిగింది. మరో పక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రుణ మాపి, బోనస్, గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి పథకాలను ప్రజలకు ఇస్తూ, మరో పక్క గత 10సంవత్సరాలనుండి మీరు చేసిన అప్పులను కడుతు, ఈ రాష్టాన్ని ముందుకు తీసుకెళ్తునం. నిన్న అసెంబ్లీలో మాట్లాడిన గవర్నర్ కాంగ్రెస్ కార్యకర్తలా మాట్లాడరని అంటున్నారు మరి మీరు అధికారంలో వున్నప్పుడు బీజేపీ కార్యకర్తల మాట్లాడరా అని విమర్శించారు. గవర్నర్ ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని చదివారు. గవర్నర్ తన యొక్క బాధ్యతను నిర్వహించారు.పది సంవత్సరాలనుండి అక్రమంగా సంపాదించిన సొమ్ము ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఇలాంటి ఆరోపణలు రేవంత్ రెడ్డి పై చేస్తుంటే ఊరుకునేది లేదని, బీజేపీ కోవర్ట్ ఐనా హరీష్ రావును తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నరేందర్,అగ్గు బోజన్న,బాగా రెడ్డి,కనపూర్ లింగం, దుబ్బ నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు