Saturday, August 2, 2025
Homeఆంధ్రప్రదేశ్తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన బోధన్ సబ్ కలెక్టర్…

తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన బోధన్ సబ్ కలెక్టర్…

Listen to this article

తహసిల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్…

రుద్రూర్, ఆగస్టు 2 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :

రుద్రూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఆకస్మికంగా సందర్శించారు. రెవెన్యూ సదస్సులు, దరఖాస్తుల క్లియరెన్స్ ల స్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న రెవెన్యూ దరఖాస్తుల ప్రాసెసింగ్ ను వేగవంతం చేయాలన్నారు. నిర్ణీత గడువులోపు వాటిని పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ తహశీల్దార్ తారాబాయి, డిప్యుటీ తహసిల్దార్ సురేందర్ నాయక్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments