
తిరువూరు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
. పయనించే సూర్యుడు మార్చ్ 13 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు.
వైయస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను జిల్లా ఉపాధ్యక్షులు కలకొండ రవికుమార్, పట్టణ పార్టీ అధ్యక్షులు చలమాల సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు తాళ్లూరి నవీన్ కుమార్ ఆవిష్కరించారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి వాళులర్పించారు. పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచిపెట్టి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 15 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెంట నడిచిన పార్టీ కుటుంబ సభ్యులకు ఆయన ధన్యవాదాలు వారు తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలన్నదే వైయస్ఆర్సీపీ లక్ష్యమని, అధికారంలో ఉన్నా,ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పరితపించే నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. భవిష్యత్తులో మళ్లీ అధికారం మనదేనని పేర్కొన్నారు. కార్యకర్తలకు అండగా పార్టీ ఉంటుందని ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గత్తం కస్తూరి బాయి, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపిటిసిలు, వివిధ హోదాల్లోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు