
పయనించేసూర్యుడు,ఫిబ్రవరి 12,కాప్రా ప్రతినిధి సింగం రాజు: తీర్థయాత్రకు వెళ్లి వస్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుమూల పరమేశ్వర్ రెడ్డి పరామర్శించారు.నాచారంలోని పలు కాలనీలకు చెందిన వారి ఇళ్లకు పరమేశ్వర్ రెడ్డి వెళ్లి వారికుటుంబ సభ్యులను పరామర్శించిఓదార్చారు.వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.బుధవారం నాచారం కు చేరుకున్న సురకంటి మల్లారెడ్డి,రాంపల్లి రవి కుమార్, బోరం పేట సంతోష్, కల్కూరి రాజు, సోమవరం శశి కాంత్ మృతదేహాలకు పరమేశ్వర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృష్ణ రెడ్డి, నాచారం డివిజన్ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్,రామ్ రెడ్డి,అశ్వద్దామా రెడ్డి,మహేష్ యాదవ్,మామిడాల సంతోష్ రెడ్డి,గదా క్రాంతి, శ్రవణ్, చిల్క నరేష్, శ్రీనివాస్ రెడ్డి , కృష్ణ రెడ్డి, బోలెం నరేష్, భారతమ్మ ,లీలా పాల్గొన్నారు.