
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జులై 16
2025 ఏప్రిల్, మే, నెలలో తునికాకు సేకరించిన కార్మికులకు ప్రభుత్వం ఒప్పందం ప్రకారం మూడు రూపాయల 90 పైసలు తక్షణమే చెల్లించాలని, 2021 తునికాకు బోనస్ సేకరించిన కార్మికులకు అందరికీ ఇవ్వాలని, 2012 నుంచి పెండింగ్ లో ఉన్న బోనస్ తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో తునికాకు కార్మికులు ఐటిడిఏ వద్ద ఆందోళన నిర్వహించినారు. బుధవారం నాడు ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో చింతూరు ఏజెన్సీ ఆదివాసి ప్రజానీకం తునికాకు సేకరణ డబ్బులు చెల్లించాలని కోరుతూ ఐటీడీఏ వద్ద ఆందోళన చేపట్టడం జరిగినది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు నిరసనను తెలియజేసినారు అనంతరం ప్రధాన సమస్యలతో కూడినటువంటి దరఖాస్తును ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి అపూర్వ భరత్ గారికి సమస్యలు ను వివరించడం జరిగినది దరఖాస్తు స్వీకరించిన స్థానిక పిఓ గారు ఫారెస్ట్ అధికారులు తునికాకు సేకరణ కార్మికులకు డబ్బులు చెల్లించడం ఎందుకు లేట్ అవుతుందని వివరణ అడిగారు తక్షణమే 75 లక్షలు రూపాయలు అందుబాటులో ఉన్నాయని వీటిని గ్రామాల్లోకి కార్మికులకు అందిస్తామని సేకరణకు సంబంధించి మూడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందని ప్రభుత్వం వైపు నుండి ఆలస్యం అవడంతో కార్మికులకు అందించడం ఆలస్యం అవుతుందని సమస్యను త్వరలో పరిష్కరిస్తామనీ పి ఓ గారు తెలపడం జరిగినది అనంతరం గిరిజన సంఘం చింతూరు మండల కార్యదర్శి ముట్టుమ్ రాజయ్య అధ్యక్షతన జరిగిన సభను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మర్లపాటి నాగేశ్వరరావు, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు సీసం సురేష్, కాక అర్జున్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన గిరిజనేయాత్రలకు వేసవికాలంలో రెండో పంటగా అనేక ఏళ్లగా ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తూ అండదండగా ఉన్న తునికాకు సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని అన్నారు ఈ ఏడాది తునికాకు సేకరణ టెండర్లు కూడా నిర్వహణ నిర్లక్ష్యం గా వ్యవహరించడంతో సేకరణ కూడా చాలా ఆలస్యం అయిందని అంతేకాకుండా కార్మికులకు చెల్లించవలసినటువంటి సేకరణ డబ్బులు కూడా ప్రభుత్వం ఇవ్వడంలో వైఫల్యం చెందిందన్నారు కార్మికులు పొట్టకూటి కోసం కుటుంబ అవసరాల కోసం ఎండనక వాననక అడవుల వెంబడి క్రూర జంతువుల మధ్య తునికాకును సేకరిస్తే కాంట్రాక్టర్ల నుండి రాయల్టీ పేరుతో ప్రభుత్వానికి ఆదాయం వస్తే కష్టపడిన కార్మికులను గాలికి వదిలేయడం సరైనటువంటి విధానం కాదని అన్నారు, ప్రభుత్వం చిత్తశుద్ధితో తక్షణమే కార్మికుల కష్టమైనా ఆకు సేకరణ డబ్బులను అందించాలని అన్నారు అంతే కాకుండా తునికాకు సేకరణకు బోనస్ ద్వారా కార్మికులకు న్యాయం చేస్తామని ఆనాడు కార్మిక సంఘాలు పోరాట ఫలితంగా తునికాకు బోనస్ ఇచ్చారని 2012 నుండి బోనస్ను ప్రభుత్వం తన ఖజానా నుండి విడుదల చేయకుండా కార్మికుల కష్టాన్ని దోచుకుందని ఆదివాసి సంఘాలు కార్మిక సంఘాలు పోరాట ఫలితంగా 2021 తునికాకు బోనస్ విడుదల చేశామని అందరికీ డబ్బులు వస్తాయని కళ్ళేదారులను గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులు బ్యాంకు ఖాతా పుస్తకాలు ఆధార్ జిరాక్స్లు ఇవ్వాలని వివరాల అందించాలని సేకరించి నేటికీ అరకురా గ్రామాలకు మాత్రమే తునికాకు బోనస్ డబ్బులు చెల్లించారని ఈ డబ్బులు ప్రభుత్వం నుంచి విడుదలయితే సహకరించిన కార్మికులకు అందజేయడంలో ఫారెస్ట్ అధికారులు విప్లవం చెందారని అన్నారు 2021 బోనస్ను ఫారెస్ట్ అధికారులు తక్షణమే కార్మికులకు అందించాలని లేనిపక్షంలో బోనస్ డబ్బులు తమ ఖాతాల్లో ఉంచడం తగదని చెల్లించే విషయంపై ఫారెస్ట్ ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేపట్టాలని 2021 బోనస్ విడుదలయితే లబ్ధిదారులకు చెల్లించడానికి ఎందుకు దీర్ఘకాలంగా ఆలస్యం అవుతుందో కార్మికులకు తెలియజేయాలని సమస్య పరిష్కారానికి కృషి చేయకపోతే ఐటీడీఏ మరియు ఫారెస్ట్ కార్యాలయాలు ఎదుట తునికి కార్మికులతో దీర్ఘకాలిక ఆందోళన చేపడుతామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగినది ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి చాలా నిర్లక్ష్యపూరితంగా కనిపిస్తుందని ఏజెన్సీలో ఉన్న కనీసంపద సహజ వనరులు పై కార్పొరేట్ అధినేతలకు అప్పజెప్పడానికి ఈనాడు అనేక కుతంత్రాలు చేస్తున్నారని ఏజెన్సీలో ఉన్న ఆదివాసులను గెంటివేయాలని చూస్తున్నటువంటి ప్రభుత్వం ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా లో ఆదివాసులకు న్యాయంగా సహజ వనరులపై హక్కులు ప్రభుత్వం కల్పించాల్సినటువంటి హక్కులు అమలుపై శ్రద్ధ పెట్టడం లేదని రాబోయే రోజుల్లో ఆదివాసీల పోరాటాలను సరిచూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో కుంజా సీతారామయ్య కారం సుబ్బారావు, పోడియ లక్ష్మణ్, కారం సుందరయ్య, పూనం ప్రదీప్, కుంజ నాగిరెడ్డి, బాబు బుర్రయ్య, పాయం సీతారామయ్య, తెల్లం తమ్మయ్య, పుడియం జానీ, కుంజ సుధీర్, కోసం వీరయ్య, సోడే చిన్నమ్మి, సోడే కమలమ్మ, సోడే రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.