పయనించే సూర్యుడు అక్టోబర్ 27 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
ప్రస్తుతము బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో అధిక వర్షపాతం నమోదు కావచ్చునని వాతావరణ శాఖ వారు హెచ్చరించియున్నారు.✓అందుపై సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో నివసించుచున్న ప్రజలు అప్రమత్తంగా ఉండవలెనని ముఖ్యముగా లోతట్టు ప్రాంతాల్లో నివసించుచున్న ప్రజలు అత్యవసర పరిస్థితులలో తప్ప బయటికి వెళ్ళరాదని తెలియజేయడమైనది.✓సూళ్లూరుపేట పట్టణ ప్రజలు అత్యవసర పరిస్థితులలో పురపాలక సంఘం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ : 08623-295456 నకు సహాయం కొరకు 24X7 సంప్రదించవచ్చునని తెలియజేయడమైనది.✓అత్యవసర పరిస్థితులలో సహాయక చర్యలు చేపట్టుటకు స్పెషల్ టీములను ఏర్పాటు చేయడమైనది.✓ పురప్రజలకు పురపాలక మరియు వార్డు సచివాలయ సిబ్బంది 24×7 అందుబాటులో ఉండునని, ఏదైనా అత్యవసర సహాయము కొరకు 24X7 సంప్రదించవచ్చునని తెలియజేయడమైనది.✓అదేవిధంగా వర్షాభావ పరిస్థితుల వలన సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా కాచి చల్లార్చిన నీటిని తాగవలసిందిగా తెలియజేయడమైనది.ఇట్లు కమీషనర్, సూళ్లూరుపేట పురపాలక సంఘము

