నీట మునిగిన వరి పొలాలు పత్తి పంటలు
తుఫాను తాకిడికి రైతుల కలలన్నీ నీటిలో కలిసిపోయాయి
మొంథా తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో వర్షం బీభత్సం ఈదురుగాలులతో సృష్టించాయి
రైతే రాజు దేశానికి వెన్నుముక అని చెప్పడమే కానీ ఏనాడు రైతు రాజు అయినట్టు చరిత్రలో లేదు
రైతు వ్యవసాయం చేయటం అప్పులు పాలు అవ్వడం రైతుల కష్టాలను పట్టించుకునే రాజకీయ నాయకులు గాని అధికారులు గానీ కరువయ్యారు
పయనించే సూర్యుడు అక్టోబర్ 30 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం జిల్లాలో మొంథా తుఫాన్ తాకిడికి రైతుల జీవితాలను అల్లాకల్లోలం చేసింది ఆరు కాలం కష్టపడి చేతికొచ్చిన పంట అంతా నీటి లో కలిసిపోయి ఆర్థికంగా రైతుల జీవితాలను తలకిందులుగా చేసింది, కుండపోత వర్షాలు ఈదురు గాలులు వల్ల పత్తి పంటలు వరి పొలాలు నేలకి వరిగాయి , వేల ఎకరాలు వరి పంట మరియు పత్తి పంట కంకులు చేతికి వచ్చిన దశలో నీటిలో తేలుతూ రైతుల కళ్ళల్లో కన్నీటి దారాలు పారుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళముందే నీటిలో మునిగిపోతుంటే గుండె పగిలేలా ఏడవడం తప్ప చేసేది ఏమీ లేదు అన్నట్టు రైతుల గోస వేలవేల అర్ధనాదాలు చేయడం తప్ప మరి ఏమీ లేదు రైతులు ఎకరానికి 40 వేల నుండి 60 వేల వరకు నష్టం జరిగి ఉంటుంది అని అంచనా ప్రస్తుతం 40 బస్తాలు పండవలసిన వరి పంటలు 10 నుండి 15 బస్తాల వరకు దిగుబడి తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తుంది నీరు నిల్వ ఉండడం వల్ల దిగుబడి చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది క్రమంగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక గ్రామాల్లో రవాణా కోరుకుంటున్నారు స్తంభవించింది రోడ్లు అంత గుంతల మయంగా ఏర్పడ్డాయి రైతులు తమ పంట లను ఆర్థిక నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి ఆర్థిక భరోసా కల్పించాలని రైతులు కోరుకుంటున్నారు ఇంత పెద్ద నష్టం ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు ఈ పంటల మీదే ఆధారపడి జీవిస్తున్నామని రైతులు తమ బాధను ఈ విధంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు తక్షణ సహాయం అందించాలని అన్నదాతలు కోరుతున్నారు


