
పయనించే సూర్యుడు ఏప్రిల్ 13 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరు పులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం.. దక్షిణ భారతదేశంలో విస్తారమైన మేఘాలు కేంద్రీకృతమ య్యాయి. ఈ మేఘాలు తూర్పు దిక్కుగా కదులు తూ తెలుగు రాష్ట్రాల వైపు వేగంగా వస్తున్నాయి. మరో వైపు ఆగ్నేయ ఆసియా ప్రాంతం నుంచి కూడా మేఘాలు రావడం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుము లు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ నాగర్ కర్నూల్ వనపర్తి జోగు లాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాతాల్లో ఉరుములు, మెరుపుల తోపాటు ఈదురు గాలులు గంటకు ముప్పై నుంచి నలబై కిలోమీటర్లు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతా ల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ణ స్థాయిలో నమోదవుతా యని వాతావరణ శాఖ పేర్కొంది. రాత్రి సమయానికి వాతా వరణం కొంత చల్లబడే అవకాశం ఉందని… రాబోయే మూడు రోజులు పాటు తెలంగాణలో అక్కడ క్కడా చెదురు మదురుగా వర్షాలు కురుస్తూనే ఉంటా యని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.