
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 01
తెలంగాణ ఆదివాసీ సమాజానికి భారత్ ఆదివాసీపార్టీ నుండి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని భారత్ ఆదివాసీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు అన్నారు.1976లో భారతదేశం ఎమర్జెన్సీలో ఉండగా పార్లమెంట్ లో ఎటువంటి తీర్మానం లేకుండా మైదానవాసులైనా లంబాడీలు గిరిజన జాబితాలోకి చేర్చడంతో గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ని మొత్తం ఉపయోగించుకోవడమే కాకుండా,లంబడీలు ఉండే రాష్ట్రాలనుండి వలసలు పెరిగి తెలంగాణాలో ఆదివాసీలు(9 తెగలు)3 శాతం ఉండగా,లంబాడీలు 7 శాతమై,గిరిజన రిజర్వేషన్లు పూర్తిగా ఉపయోగించుకొని స్పీపర్ నుండి చీఫ్ ల వరకు,అటెండర్ నుండి ఐఎఎస్,ఐపిఎస్ అధికారులుగా, ఆర్ధికంగా,రాజకీయంగా అభివృద్ది చెందుతూ ఆదివాసీలను అణగదొక్కుతున్నారు. లంబడాలు 60 లక్షలమంది వరకు ఉన్నామని,60 అసెంబ్లీలలో తమ ప్రభావం ఉంటుందని ప్రభుత్వాలనే మార్చే దమ్ముందని పార్టీలనే భయపెట్టే పరిస్థితికి లంబాడీలు పెరిగారని,వలస వచ్చి అడ్డదారుల్లో గిరిజన జాబితాలోకి వచ్చిన లంబాడీలను గిరిజన జాబితానుండీ తొలగించాలని తెలంగాణ ఆదివాసీ సమాజం చేస్తున్న పోరాటానికి భారత్ ఆదివాసీపార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఎసి సంపూర్ణమైనా మద్దతు ఉంటుందని ఆయన అన్నారు.