
ఆర్టీసీ డిపోల వద్ద.సంబరాల్లో ముఖ్య అతిథిగా హాజరైన ఇల్లందు ఎమ్మెల్యే కోరం
పయనించే సూర్యుడు జూలై 23 పొనకంటి ఉపేందర్ రావు
ఇల్లందు:ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 200 కోట్ల మార్క్ మైలు రాయి తాకింది. 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలు, 341 బస్ స్టేషన్లలో సంబరాలు జరుపుకుంటున్నారు. ఇల్లందు బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సంబరాల్లో ముఖ్య అతిథిగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్యహాజరై ఇల్లందు నుంచి వివిధ ప్రాంతాలకు వృత్తిరీత్యా ప్రతిరోజు ప్రయాణించే మహిళా ప్రయాణికులకు సన్మానం చేశారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. అనంతరం మాట్లాడుతూ మహిళలకు ఉచిత ప్రయాణం పథకం 18 నెలల్లో 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని చేరుకోవటం సంతోషంగా ఉందన్నారు, ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పాటైన 18 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు, మహిళా స్వయం శక్తి రుణాలు, ప్రతి ఇంటికి 200 యూనిట్ ఉచితంగా విద్యుత్, రైతు భరోసా, సన్నాలకు బోనస్, రేషన్ షాపుల ద్వారా ఉచిత సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లులు, ఇలా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది అని తెలిపారు. ఖమ్మం నుంచి ఇల్లందుకు రాత్రి 10 నుంచి 11 గంటల మధ్యలో రెండు సర్వీస్ లు పెంచాలని ఆర్టీసీ సిబ్బందికి సూచించారు. అనంతరం ఆర్టీసీ సిబ్బంది ఎమ్మెల్యే గారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్, ఎస్సై శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీసీట్రాఫిక్ ఇంచార్జ్ సునీత, గ్యారేజ్ ఇంచార్జ్ ఎన్వి నారాయణ, నియోజకవర్గ నాయకులు మడుగు సాంబమూర్తి, మండల రాము, బొల్లా సూర్యం, చిల్లా శ్రీనివాస్, ఉలింగ సతీష్, కొక్కు నాగేశ్వరరావు, కార్యదర్శి జాఫర్, ఎర్రసంగి వెంకన్న, నిర్మల, ఇందిరా మహిళ స్వయం శక్తి మహిళలు, ప్రయాణికులు, ప్రజలు పాల్గొన్నారు.