
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ కుమార్ నారాయణ భవన్ లో ప్రెస్ మీట్
అతి ఉత్సాహం చూయించిన పోలీసుల పై చర్య తీసుకోవాలని డిమాండ్.వి. ప్రభాకర్. బి. దేవారం……
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 420 హామీలు ఆరు గ్యారెంటీలు ఏడవ గ్యారెంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజా పాలన అందిస్తానని హామీలు ఇచ్చారు.
ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో కాంగ్రెస్పార్టీ నే ప్రజలు ప్రశ్నిస్తారని భయంతో ఎక్కడికక్కడ తమ పర్యటనలను అడ్డుకుంటారని ముందస్తు అరెస్టు చేయడం, ఆ ప్రజాస్వామ్య చర్య అని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్. ప్రజాపంథా ఈ చర్యను ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని విజ్ఞప్తి… ధర్నా చౌక్ రద్దు చేసిన టిఆర్ఎస్ పార్టీని ఆడిపోసుకున్న రేవంత్ రెడ్డి నేడు కేసిఆర్ బాటలోనే పయనిస్తున్నాడని అన్నారు.నిన్నటి రోజున ఒక సమావేశంలో మాట్లాడుతూ కమ్యూనిస్టులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవచ్చు కానీ ప్రభుత్వాన్ని గద్దె దించే శక్తి ఉందని అన్నారు. కమ్యూనిస్టులు ఉప్పు లాంటి వారని ఉప్పే లేకపోతే వంటలు రుచి రావని, చెప్పి ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రభుత్వాలు బాధ్యతలు కూడా మర్చిపోతాయని అన్న రేవంత్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో ఏ మంత్రి వచ్చినా.. ప్రతిపక్ష పార్టీలు ప్రజాపంధా నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం ఏడవ గ్యారెంటీకి సమాధి కట్టడమేనని తీవ్రంగా విమర్శించారు .సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యాలయం పై పోలీసులు ఉదయాన్నే దాడి చేసి మహిళలు ఉన్నారని చూడకుండా మహిళల్ని అవమానించి ,వేధించే పద్ధతుల్లో సివిల్ డ్రెస్ లోవచ్చిన పోలీసులు అతి ఉత్సాహం చూపించడం సరికాదని వారిపై సిపి చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు..పిడిఎస్ జిల్లా నాయకులు నిఖిల్ను.. పిడిఎస్యు జిల్లా నాయకులు అనిల్ ఇంటిపై దాడి చేయడం ఇదెక్కడి సంప్రదాయం అని ప్రశ్నించారు.. రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షుడు నరేందర్ ఇంటిపై దాడి చేసి రూములన్ని వెతకడం మహిళలను భయభ్రాంతులకు గురి చేయడము గడిలపాలనని విమర్శించే కాంగ్రెస్కు తగునా అని అన్నారు.ఇప్పటికైనా మీ ప్రజా పాలన అంటే ప్రశ్నించే గొంతును పిసకడమా!! అరెస్ట్ చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.సమావేశంలో. జిల్లా నాయకులు. ఎం. ముత్తెన్న. ఆర్మూరు సంయుక్త మండల కార్యదర్శి. బి. కిషన్. యు రాజన్న. నిఖిల్. నరేష్. తదితరులు పాల్గొన్నారు.
