Thursday, April 3, 2025
Homeఆంధ్రప్రదేశ్తెలంగాణ కాంగ్రెస్ కమిటీ జై బాబు జై భీమ్ సంవిధాన్

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ జై బాబు జై భీమ్ సంవిధాన్

Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్

కార్యక్రమంలో పాల్గొన్న ఐ డి సి ఎం ఎస్ చైర్మన్ బాదావత్ తారచంద్ నాయక్ .

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఐ సి సి పి సి సి మరియు సి సి ఆదేశానుసారం ఈరోజు కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్ పల్లి మండలం చౌటపల్లి గ్రామంలో మన దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం మన నినాదం జై బాబు.. జై భీమ్ జై సంవిధాన్ నినాదం చేస్తూ గ్రామంలో నాయకులతో కార్యకర్తలతో కలిసి నినాదాలు చేస్తూ పాదయాత్ర చేసిన *ఈ కార్యక్రమ కోఆర్డినేటర్ మరియు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఐ డి సి ఎం ఎస్ చైర్మన్ బాదావత్ తారచంద్ నాయక్ అలాగే గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి నినాదాలు చేయడం జరిగింది. తదనంతరం డి సి ఎం ఎస్ చైర్మన్ బాదావత్ తారచంద్ నాయక్ మాట్లాడుతూ ముందుగా చౌట్పల్లి గ్రామ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. మన భారతదేశం నేడు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుంది. గత పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బిజెపి మన రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ అప్రజస్వామ్య పాలన సాగిస్తుంది. పెద్దస్వామ్య వ్యవస్థను గౌరవించాల్సిన పాలకులే నేడు నాశనం చేస్తున్నారు.అందుకే మన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మనకు అహింస శాంతి సిద్ధాంతాలను అలవరించిన మన మహాత్ముడు అయినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ స్మరించుకుందాం. అలాగే రాజ్యాంగాన్ని రచించి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన *రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను కాపాడుకుందాం అందుకే జై బాబు.జై భీమ్. జై సంవిధాన్. నినాదాలతో ఉద్యమిద్దాం. భారత ప్రజలమైన మేము భిన్నత్వంలో ఏకత్వం లో కూడిన భారతదేశ నిర్మాణానికి కోటానుకోట్ల సంఖ్యలో ధృఢ నిశ్చయంతో జీవితాలను కొనసాగిస్తున్నాం. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నాడు ఒక మహాకవి. ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరుగుతున్నాము ఇక్కడే పని చేస్తున్నాము. అద్భుతమైన దేశ సంపదను సృష్టిస్తున్నాం. రైతులుగా, కార్మికులుగా, విద్యార్థులుగా,మేధావులుగా, సైనికులుగా, సేవకులుగా భారతదేశాన్ని సృజనాత్మకంగా మార్గంలో పయనింప చేస్తున్నాం భారతీయులం మేమే భారతదేశం. మన దేశంలోని వివిధ ప్రాంతాలు వర్గాలు మరియు సంస్కృతుల నుండి ఎన్నుకోబడిన సభ్యుల సమాహారమే రాజ్యాంగ పరిషత్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా, సుదీర్ఘ చర్చల అనంతరం గొప్పదశానికి రాజకీయ, ఆర్థిక, సామాజిక లక్ష్యాల సాధన కోసం 26 జనవరి 1950 రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ప్రజల భవిష్యత్తు కోసం రాజ్యాంగం ఒక వాగ్దానంగా నిలబడింది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా బాధితులకు రక్షణ కవచమే భారత రాజ్యాంగం. మహాత్మా గాంధీ భావించినట్లుగా వ్యక్తి బాధ్యతలను గుర్తు చేసి సమాజ సంక్షేమానికి ఊతమిచ్చేదే భారత రాజ్యాంగం. రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రకటించినట్లుగా ఎక్కడ విశాల భావనలకు అవకాశం ఉంటుందో, విజ్ఞానం స్వేచ్ఛగా అందించబడుతుందో ఆ దేశమే భారతదేశం. అందుకే మన దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం మన నినాదం జై బాబు.. జై భీమ్… జయ సంవిధాన్… తదనంతరం గౌరవనీయులు ఐ డి సి ఎం ఎస్ చైర్మన్ బాదావత్ తారాచంద్ నాయక్ ని నాయకులు కార్యకర్తలు శాలువాతో సన్మానించడం జరిగింది. మండల అధ్యక్షుడు సంకట రవి జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి తక్కురి దేవేందర్ కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్ రెడ్డి టి పి సి సి అధికారం ప్రతినిధి వేణు యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య మాజీ ఎంపీపీ గుడిసె అంజమ్మ రేవతి గంగాధ ర్ సిరిపురం రవీందర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ శ్రీనివాస్ కొమ్ముల రాజేందర్ గోపిడి లింగారెడ్డి బద్దం రవి మేకల క్రాంతి మనోహర్ సృజన్ శ్రీకాంత్ ఆనంద్ బాలయ్య అల్ల కొండ రాజేష్ రంజిత్ డాక్టర్ మురళి వెన్నెల దేవేందర్ పడాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments