
పయనించే సూర్యుడు మార్చి 21 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రఖ్యాత అమెరికన్ మల్టీనేషన్ ఫుడ్ చైన్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు సీఈవో క్రిస్ కెంజిన్స్కీ తో సమావేశమయ్యారు. చర్చల అనంతరం మెక్‌డొనాల్డ్స్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో భారీ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. మెక్‌డొనాల్డ్స్ పెట్టుబడుల కోసం దేశంలోని ప్రముఖ నగారాలు పోటీపడినా, హైదరాబాద్ నగరంలోని సానుకూలతలు, ఇక్కడ అందుబాటులో ఉన్న నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, బహుళజాతి కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం తదితర అంశాలను ముఖ్యమంత్రి వివరించి, మెక్ డొనాల్డ్స్ సంస్థ తన గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా ఒప్పించారు. గడిచిన 15 నెలల కాలంలో తెలంగాణలో చోటుచేసుకున్న అభివృద్ది, యువతకు నైఫుణ్యతలు నేర్పించడానికి ఇస్తున్న ప్రోత్సాహం, అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వివరాలను ముఖ్యమంత్రి మెక్‌డొనాల్డ్స్ కంపెనీ ప్రతినిధులకు వివరించారు.