
పయనించే సూర్యుడున్యూస్ ఏప్రిల్ 02 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణి కార్యక్రమాన్ని ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు బుధవారం కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ సన్న బియ్యాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని. సన్న బియ్యాన్ని డీలర్లు బియ్యాన్ని పక్క త్రోవ పట్టించొద్దని అదేవిధంగా ఈ యొక్క సన్నబియాన్ని పంపిణీ చేయడం దేశంలోనే కాదు బిజెపి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా సన్న బియ్యం పంపిణీ చేయలేకపోతున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సన్న బియ్యం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమవుతుందని ప్రజలందరూ ఇలాంటి బహుత్కర సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఇలాంటి బియ్యాన్ని పక్కదారి పట్టకుండా చూడాలని ఎమ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేశారు .
ఈ కార్యక్రమంలో కోయగూడెం మాజీ సర్పంచ్ ఉమా – సురేందర్ తహసిల్దార్ , నాగ భవాని ,జీసీసీ మేనేజర్ నర్సింహారావు ,ఎంపీడీఓ రవీంద్ర రావు, ఎంపీవో గణేష్ గాంధీ, పంచాయతీ సెక్రటరీ రేషన్ డీలర్ల సంగం జిల్లా అద్యక్షుడు ఊకె శేఖర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈది గణేష్, మంగీలాల్ , గ్రామస్థులు పాల్గొన్నారు.