
పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 29 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో శనివారం నిజామాబాద్ జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి ప్రచార కమిటీ అధ్యక్షుడు మెగావత్ సరిదాస్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కి లంబాడీల ముద్దుబిడ్డ బెల్లయ్య నాయక్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా మెగావత్ సరిదాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గోరుబోలి లంబాడి భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సందర్భంగా చిత్రపటాలకు పాలభిషేకం చేయడం జరిగింది అని గోరు బోలి లంబాడి భాష గౌరవమని తెలంగాణ అసెంబ్లీ చరిత్రత్మక నిర్ణయమని ఇది లంబాడి భాషాభిమానులకు గొప్ప గర్వకారణమని ఈ చరిత్రమాక నిర్ణయాన్ని స్వాగతిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ముందడుగు ప్రశంసనీయమని అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డికి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ కు వడ్డేపల్లి లంబాడి గ్రామస్తులు తరఫున మరియు బోధన్ నియోజకవర్గం తరపున మరియు నిజామాబాద్ జిల్లా గ్రామస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు