
ఐ.టీ.డీ.ఏ. ప్రాజెక్టు అధికారి బి.రాహుల్
పయనించే సూర్యుడు జులై03 (పొనకంటి ఉపేందర్ రావు)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనియన్ పబ్లిక్ సర్వీస్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు -2026 సంవత్సరం కొరకు తెలంగాణ రాష్ట్ర ST,SC ,BC అభ్యర్థులకు హైదరాబాదులోని రాజేంద్రనగర్లో గల గిరిజన IAS స్టడీ సర్కిల్ ద్వారా రెసిడెన్షియల్ పద్ధతిలో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన తెలంగాణ రాష్ట్ర ST,SC,BC అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తుల కోరుచున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులను ఆబ్జెక్టివ్ టైప్, ఆస్టిట్యూడ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయబడునని, దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. మూడు లక్షలకు మించరాదని, అభ్యర్థులు http://studycircle.cgg.gov.in లో లాగిన్ చేసుకొని గత నెల 14 నుండి ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ లు చేసుకుంటున్నారని, ఈనెల నాలుగో తేదీ శుక్రవారం వరకు ఎవరైనా అభ్యర్థులు ఆన్లైన్ చేసుకోకపోతే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన అన్నారు. ఆన్లైన్ అప్లికేషన్ మరియు సూచనలు కొరకు http.//twd.telangana gov.in వెబ్సైట్లో అందుబాటులో కలవని ఆయన తెలుపుతూ మరిన్ని వివరాల కొరకు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం లోని భవిత సెల్ నందు సంప్రదించాలని ఆయన కోరారు.