
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
సెంట్రల్ జాయింట్ సెక్రటరీ మిస్టర్ అతుల్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ఎన్నికలు సజావుగా ముగిశాయి. ఎన్నికల నిర్వహణ బాధ్యతను నిర్వాహకులు ప్రతిష్టాత్మకంగా చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు. మహామన మదన్మోహన్ మాల్వి 1928లో భారత దేశంలోని పేద వెనుకబడిన పిల్లలకు స్కౌటింగ్ అర్హత కల్పించాలని సంకల్పంతో హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ప్రారంభించారు. అప్పట్లో అది ఒక సాధారణ సంఘంగా కొనసాగుతున్నా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అధికారిక గుర్తింపు పొందిన సంఘంగా అభివృద్ధి చెందింది. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ సంస్థలు మిస్టర్ బద్రీనాథ్ రీజనల్ ఆర్గనైజింగ్ కమిషనర్ అనే కీలక పదవికి నియమితులయ్యారు. ఈ నియామకంతో ఆయనకు తూర్పు తీర రాష్ట్రాలైన తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో స్కౌటింగ్ కార్యకలాపాల సమన్వయ బాధ్యతలు అప్పగించబడ్డాయి. తన దీర్ఘ అనుభవం మరియు పరిపక్వతతో మిస్టర్ బద్రీనాథ్ స్కౌటింగ్ ఉద్యమానికి కొత్త ఊపును తీసుకు వస్తారని సంస్థ నమ్మకం వ్యక్తం చేసింది. ఈ ప్రాంతాలలో యువత సామాజిక సేవ కార్యక్రమాలలో మరింత చురుకుగా పాల్గొనేలా ఆయన ప్రణాళికలు రూపొందించనున్నారని తెలియజేశారు. ఆయన నాయకత్వంలో హిందుస్థాన్ స్కౌటింగ్ అండ్ గైడ్స్ కార్యక్రమాలు మరింత విస్తరించి సమాజంపై సానుకూల ప్రభావం చూపుతాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. సంఘం యొక్క పరిపాలన వ్యవహారాల్లో డాక్టర్ ప్రవీణ్ ను స్టేట్ చీఫ్ కమిషనర్ గా డాక్టర్ సురేష్ ను స్టేట్ సెక్రటరీగా అధికారికంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఇద్దరూ తమ అనుభవంతో సంస్థకు మరింత బలాన్ని చేకూర్చుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో కేంద్రస్థాయిని ప్రతినిధించే బాధ్యతలతో మిస్టర్ మహేందర్ నాయక్ ని నోడల్ అధికారిగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన తన గత అనుభవం సంకల్పం సమర్ధతను పరిగణలోకి తీసుకొని ఈ పదవికి ఎంపిక చేశారు. ముందున్న కార్యక్రమాల సమన్వయం, కేంద్ర మరియు ప్రాంతీయ విభాగాల మధ్య సమర్థవంతమైన సమాచార ప్రవాహం మరియు పర్యవేక్షణ బాధ్యతలు ఈ నూతన నియామకంతో మరింత బలపడనున్నాయి.