Thursday, July 10, 2025
Homeఆంధ్రప్రదేశ్తెలంగాణ రైతులకు అవసరం ఉన్నంత యూరియా, డి ఏ పి సప్లై చేయాలి.. కేంద్ర ప్రభుత్వ...

తెలంగాణ రైతులకు అవసరం ఉన్నంత యూరియా, డి ఏ పి సప్లై చేయాలి.. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమిద్దాం.

Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్

తెలంగాణ నిజాంబాద్ జిల్లా ఏ ఐ యు కె ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. వి ప్రభాకర్. కార్యదర్శి.. బి దేవారం పిలుపు.


తెలంగాణ రాష్ట్రంలో కోటి యాభై లక్షల ఎకరాల సాగు చేయబడుతుందని ఇందుకుగాను జూన్ మాసానికి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసర ఉంటుందని వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ అధికారుల అంచనా..యూరియా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సప్లై చేయడంలో నిర్లక్ష్యం కుట్రబుద్ధి,, తో తక్కువ పంపడం జరుగుతుందని ఆర్మూర్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కార్యాలయం కుమార్ నారాయణ భవన్ లో అఖిలభారత ఐక్య రైతు సంఘం. ఐ యు కె ఎస్ ఏర్పాటుచేసిన పాత్రికేయ మిత్రుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వి. ప్రభాకర్. కార్యదర్శి. బి. దేవారం లు మాట్లాడుతూ అన్నారు. సుమారుగా ఒక్క జూన్ మాసం చివరి వరకు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా డిఎపి అవసరం ఉండగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి లక్ష యాభై వేల మెట్రిక్ టన్నులు తక్కువ పంపిందని దీన్ని ఆసరాగా తీసుకొని వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి, సహకార సంఘాల పాలకవర్గాలు, డి సి ఎం ఎస్ అధికారులు యూరియా మార్కెట్లో బ్లాక్లో అమ్ముకునే స్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రొద్దున లేస్తే బిజెపిని విమర్శించే రేవంత్ రెడ్డి యూరియా మరియు ఇన్పుట్ సబ్సిడీలు వ్యవసాయ రంగాన్ని సాధించే విషయంలో ఆందోళనకు ఎందుకు పూనుకోవడం లేదని బిచ్చం అడిగినట్లుగా నడ్డా దగ్గరికి వెళ్లి అడిగి తెలంగాణ పరువు తీయడం ఏంటి అని ప్రశ్నించారు.. మరోవైపు అధిక వర్షాలు.. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం సుమారుగా 51 వేల ఎకరాల్లో పంట నష్టపోయిందని ఒకవైపు అధికారులు చెబుతుండగా ఈ పంటలకు పంటల బీమా లేదని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలో ఇచ్చినవాగ్దానాలు అమలు చేయడంలో వైఫల్యం చెందిందని ఎద్దేవో చేశారు. ప్రచారానికి మాత్రం బడ్జెట్లో పంటల బీమాకు 1350 కోట్ల రూపాయల కేటాయించామని బాకాలు ఊదుకుంటున్నారే తప్ప నేటికీ ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందలు గాని అంగీకరాలు గాని జరగలేదు అంటే ఎగనామం పెట్టడమే అనిగుర్తు చేశారు. జూలై మాసానికి 63 మెట్రిక్ టన్నులు దేశి యూరియా, 93 విదేశీ ఏరియా రావాల్సి ఉండగా కేవలం 29 మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి వచ్చింది అంటే మన చేతగానితనానికి తెలిసింది నిదర్శనం అని ఎద్దేవా చేశారు.
రైతులు ఎరువుల కోసం సహకార సంఘాల వద్ద ఉదయమే కిలోమీటర్ల దూరంలో లైన్ కడుతూ పాస్ బుక్ కు రెండు మూడు బ్యాగులు మాత్రమే ఇస్తున్నారు. పైరవీకారులు, ఎరువుల వ్యాపారులు మాత్రం కృత్రిమ కొరత సృష్టించి డబ్బు దండుకుంటున్నారని అధికారులు వారి వాటాలు వాళ్ళు తీసుకొని రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..వెంటనే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఐక్య ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వం మెడల్ ఉంచుతామని దానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండాలని కోరారు.. ఇన్పుట్ సబ్సిడీల్ని సాధించుకుందామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు..ఈ సమావేశంలో. జిల్లా సహాయ కార్యదర్శి. బి. కిషన్. జిల్లా సహాయ కార్యదర్శి. ఆకుల గంగారాం. జిల్లా ఉపాధ్యక్షులు. యు. రాజన్న ఆర్మూర్ ఏరియా అధ్యక్షులు. జక్కం శేఖర్. తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments