
తెలంగాణ ఉద్యమ పోరాటానికి నిలువెత్తు స్ఫూర్తి.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి చేతుల మీదుగా ఘనంగా చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ.
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 27 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా( రిపోర్టర్ జిన్నా అశోక్ )
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట కేంద్రంలో చాకలి ఐలమ్మ 130 వ జయంతి సందర్భంగా అసూరి శేషాచారి దంపతుల జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులచే ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణకు ముందు పెద్ద శంకరంపేట మండల వ్యాప్తంగా ఉన్న రజక సంఘాల ఆధ్వర్యంలో పేట పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శమని అన్నారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి భూమికోసం భుక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోటి ఉమెన్స్ యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా పేరు మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని అన్నారు. రజకులు కులవృత్తుల్లోనే కాకుండా చదువులోని రాణించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల తోడ్పాటు అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహాదాత కుటుంబ సభ్యులు అసూరి రామచంద్ర చారి వేణుగోపాల చారి మురళి పంతులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేందర్ రెడ్డి, రాయిని మధుసూదన్ నారాయణ గౌడ్, దాచే సంగమేశ్వర్ అలుగుల సత్యనారాయణ సుభాష్ గౌడ్, రాజేందర్ గౌడ్ రాములు రాజు రజక సంఘం బాధ్యులు ప్రభు కిష్టయ్య, నారాయణ, దశరథ్, రాము సంఘం నాయకులు పార్టీ నేతలు ప్రజలు పాల్గొన్నారు.