పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కూకట్ పల్లీ రజక సంఘం ఆధ్వర్యంలో తూర్పు కమాన్ గావిన్ వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో వారి ఆహ్వానం మేరకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని వారి విగ్రహానికి పూలమాల నుంచి ఘన నివాళులు అర్పించారు, వారి ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమంలో పాల్గొన్నందుకు రాజేశ్వరరావు కి కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి సన్మానించారు.అనంతరం వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి. ఆమె బలిదానం ప్రతి తరానికి మార్గదర్శకం. నేడు తెలంగాణ సమాజం స్త్రీ శక్తి, ధైర్యం, సమానత్వం, న్యాయం కోసం కదిలే ప్రతి క్షణంలో చాకలి ఐలమ్మ జ్ఞాపకం ఉజ్వలంగా నిలిచిపోతుందన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


