పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 13 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి)
తెలుగుదేశ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రాం నారాయణ రెడ్డి చేతుల మీదుగా అనంతసాగరం మండలం ముఖ్యనేతల ఆధ్వర్యంలో నెల్లూరు పార్లమెంట్ తెలుగుయువత కార్యనిర్వాహక కార్యదర్శి కమ్మ ప్రభాకర్ నాయుడు తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు.ఈ సందర్బంగా ప్రభాకర్ నాయుడు మాట్లాడుతూ ఆనం నాయకత్వం లో అనంతసాగరం మండలం లో పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ను ఒక పండగలా జరిపారని, దేశం లోని ఏ రాజకీయ పార్టీ సాహసించలేని విధంగా కార్యకర్తల కోసం సంక్షేమ నిధి కి శ్రీకారం చుట్టింది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, దేశంలోని ఏ రాష్ట్రం లో, ఏ పార్టీ ఇవ్వలేని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం ’కార్యకర్తల సంక్షేమ నిధి‘ (ఇన్సూరెన్స్)ను తీసుకువచ్చిన వ్యక్తి యువనేత నారా లోకేష్ బాబు అని తెలిపారు.మండలం లో తెలుగుదేశం పార్టీ బలోపేతం కొరకు తన వంతుగా నిరంతరం శ్రమిస్తాననని ప్రభాకర్ నాయుడు తెలిపారు.
ఈ కార్యక్రమం లో సోమశిల ఉత్తర కాలువ చైర్మన్ మెట్టుకూరు కృష్ణారెడ్డి, కొత్తపల్లి పంచాయతీ నాయకుడు చల్లా చంద్రశేఖర్ రెడ్డి, శాఖమూరి చంద్ర, సావా కార్తీక్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.