పయనించే సూర్యుడు జనవరి 11 k శ్రీనివాసులు రిపోర్టర్ పెబ్బేర్ వనపర్తి జిల్లా,
వడ్డే ఓబన్న 218 వ జయంతిని పెబ్బేరు సుభాష్ చౌరస్తాలో మండల వడ్డెర సంఘం జిల్లా నాయకులు మరియు వడ్డె ఈశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
వీరు మాట్లాడుతూ వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించడం మా వడ్డెర కులస్థులకు గర్వించదగ్గ విషయం అని నంద్యాల పరివాహక ప్రాంతానికి చెందిన రేనాటి ఉద్యమ వీరుడు స్వాతంత్ర సమర యోధుడు ఆరోజుల్లో బ్రిటిష్ వారు పంటలు పండుకున్న పన్నులు కట్టాలని, బ్రిటీష్ వారి అరాచకాలకు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంటే సైరా నరసింహ్మ రెడ్డి సైన్యాధికారిగా ప్రకటించబడడం, వడ్డే ఓబన్న బ్రిటిష్ వారిపై మెరుపుదాడులు చేసేవాడని, దాడులు చేసిన అనంతరం నల్లమల్ల అడవిలోకి వెళ్లి కోతదాడుల కి వ్యూహరచన చేసేవాడు. దీనితో తెల్లదొరలు ఇతర ప్రాంతాల్లోని బలగాలను రప్పించి అణచివేతని తీవ్రతరం చేశారు. అలా దాడులు చేసే క్రమంలో ఒకసారి బ్రిటీష్ వారిని ఊచకోత పోయించాడు వడ్డె ఓబన్న. 1846 అక్టోబర్ 6 నా జగన్నాథ కొండ వద్ద భీకర పోరాటం సాగింది. అప్పుడు నరసింహారెడ్డి అనుచరుల్లో చాలా మంది మరణించారు ఐన సైరాఓబన్న చివరి వరకు పోరాడారు.ముందుగా వడ్డె ఓబన్న వీరమరణం పొందాడు.అప్పటికి ఆయన వయస్సు 39 ఏళ్ళు మాత్రమే.ఆ తర్వాత నరసింహ రెడ్డి ని బందీగా పట్టుకొని కోవెల కుంట్ల లో గుమ్మానికి ఊరి తీశారు.
అదేవిధంగా ప్రభుత్వం వడ్డెరుల చిరకాల ఆకాంక్ష ఐన ఎస్టి సాధన డిమాండ్ సంచార జాతుల మైన మేము రాళ్లు కొట్టె జీవనం కాబట్టి 50 ఏండ్లకే మా కులస్థులకు పింఛన్లు ఇవ్వాలని, మా పిల్లల చదువులకు ఎటువంటి ప్రవేశ పరీక్షలు లేకుండా గురుకులాల్లో సీట్లు కేటాయించాలని నామినేటెడ్ పదవులలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు
కార్యక్రమమం లో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డె రమేష్ , జిల్లా యువత అధ్యక్షులు అంజి ,టౌన్ అధ్యక్షులు నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు బలరాం ,వడ్డెర సంఘం నాయకులు యాదగిరి,రామకృష్ణ,రాజు, ఎల్లస్వామి లక్ష్మీనారాయణ,పి బాలకృష్ణ,విజయ్, నాగన్న,తిరుపతయ్య ,రాము , జనార్ధన్ ,రఘు,రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.