
{పయనించే సూర్యుడు} {అక్టోబర్ 21} మక్తల్ ఈరోజు హైదరాబాదులో రెండు తెలుగు రాష్ట్రాల నూతన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గా నియమితులైన ప్రముఖ సినీ నిర్మాత శ్రీ రామ్ తాళ్లూరి ని మక్తల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో రామ్ తాళ్లూరి ని మర్యాదపూర్వకంగా కలిసి అన్న కష్టానికి ఈ పదవి వచ్చినందుకు పూలమాల వేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆశయాలను జనసేన పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్లాలని ప్రజలకు సేవ చేయాలని జనసేన పార్టీని బలంగా తీసుకెళ్లాలని మరింత బలోపేతంగా తీసుకెళ్లాలని మా మక్తల్ నియోజవర్గం కూడా పార్టీ బలోపేతానికి మా వంతుగా కృషి చేస్తామని తెలపడం జరిగింది. మక్తల్ ప్రాంతం గురించి మరియు ఎంతో మహిమగల మన మక్తల్ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి చరిత్ర గురించి కురువపురం దత్తపీఠం గురించి వివరించడం జరిగింది. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జ్ సురేష్ రెడ్డి ని కూడా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మక్తల్ జనసేన పార్టీ నాయకులు రామన్ గౌడ్, గౌడి బాల్రెడ్డి, శివ ప్రసాద్, హనుమంతు, భీమేష్, పరశురాం, భీమేష్, ఆంజనేయులు, శ్రీను, బాలు తదితరులు పాల్గొన్నారు.