
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 21 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, బీసీ సంక్షేమ సంఘం బీసీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు తెల్ల హరికృష్ణ సదాలక్ష్మీల ఇరవై రెండవ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కూకట్ పల్లి ఎల్లమ్మ బండ లోని జిల్లా పరిషత్ ఉన్నతం పాఠశాల, ప్రాథమిక పాఠశాల లో పదవ తరగతి చదువుకుంటున్న విద్యార్థి, విద్యార్థులకు ప్యాడ్, పోచ్, పెన్, పెన్సిల్, స్కేల్, ఎరేజర్ గల ఎగ్జామినేషన్ కిట్టును అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో వారితోపాటు మణికంఠ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూకట్ పల్లి ఆంధ్రప్రభ దినపత్రిక విలేకరి దాసరి రాహుల్ ప్రదీప్, బుల్లెట్ రవి, రవీందర్, అర్జున్, శ్రీనివాస్ తదితరులు వారితో పాటు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధా పద్మజ, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు, లక్ష్మప్ప, విట్టల్ గౌడ్, సిద్దయ్య, గోవిందు, సుధారాణి, విజయలక్ష్మి, కిరణ్మయి, స్లివారెడ్డి, అర్చన, మౌనిక, సరోజ, రజిత తదితరు తెల్ల హరికృష్ణ మరియు వారి బృందానికి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేశారు.