
పయనించే సూర్యుడు గాంధారి 27/03/25
తేది 26-03-2025 రోజు ఉదయం 11:30 గంటలకు ప్రత్యేక అధికారి మరియు తహసీల్దార్ గాంధారి శ్రీమతి రేణుక చవాన్ అధ్యక్షతన 2025-26 సంవత్సరం నకు తైబజార్ మరియు దాఖల చిట్టి వేలములు నిర్వహించ నైనది.తైబజర్ వేలము లో (8) మంది పాటదారులు పాల్గొన్నారు ఇందులో చివరి పాటదారుగా శ్రీ గడ. రాజేష్ కుమార్ 7,64,000=00కు వేలంపాట పాడి తైబజార్ దక్కించుకున్నారు. మరియు దాఖల చిట్టి వేలము లో (8) మంది పాటదారులు పాల్గొన్నారు ఇందులో చివరి పాటదారుగా శ్రీ వాడి శ్రీధర్ 3,50,000=00కు వేలంపాట పాడి దాఖల చిట్టి వేలం దక్కించుకున్నారు ఇట్టి కార్యక్రమం లో మండల పంచాయతీ అధికారి శ్రీ లక్ష్మి నారాయణ, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్ , మాజీ ఎంపీటీసీ తూర్పు రాజులు సంగాని బాబా,గడ శంకర్, గాండ్ల లక్ష్మణ్ , ముస్తఫా,తూర్పు సంతోష్, పత్తి సాయిలు, గంగి రవి,రెడ్డి రాజులు,గ్రామపంచాయతీ సిబ్బంది మూర్తి,రవి, వంశీ, ప్రణయ్,తదితరులు పాల్గొన్నారు.