
రంపచోడవరం కేంద్రంగా తమన్న దొర పేరుతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను ప్రకటించాలి
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి జులై 25
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం నరసింహపురం ఆశ్రమం పాఠశాలలో నిర్వహించడం జరిగింది, తొలితరం మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు కారం తమన్న దొర 145వ వర్ధంతి సభను ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ చింతూరు డివిజన్ కమిటీ చైర్మన్ జల్లి.నరేష్ ఉద్యోగ జేఏసీ నాయకులు తిమ్మా సాయి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముందుగా కారం తమన్న దొర చిత్రపటానికి నరసింహపురం గ్రామ పూజారి ముచ్చిక సింగయ్య పూలమాలవేసి ప్రారంభించడం జరిగింది. ఆదివాసీ సీనియర్ నాయకులు,కారం.రంగారావు మరియు ప్రధాన ఉపాధ్యాయులు ఉర్మ వెంకటనారాయణ మాట్లాడుతూ కారం తమ్మన్నా దొర రంపచోడవరం కేంద్ర గా అనేక ఉద్యమలు చేశారు, అని పేర్కొన్నారు అనంతరం ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ.శ్రీను మాట్లాడుతూ 1857 సిపాయిలు తిరుగుబాటు కంటే ముందే రంపచోడవరం కేంద్రంగా బ్రిటిష్ వారిపై తమన్న దొర 1838 నుంచి 1848 వరకు తిరుగుబాటు జరిగింది అని1840 సంవత్సరం లో బండపల్లి కి చెందిన కోయ ముఠా దారులను 30 మంది తో బలమైన సాయుధా ఏర్పాటు చేసిన బ్రిటిష్ పోలీస్ లను 12 మందిని హతమార్చాడు అలాగే ఇంకా 20 మంది నీ తీవ్రగాయాలుపాలు చేశారు అంతటి వీరుడు కారం తమ్మన్నా అని కొనియాడారు, అలాగే వారి కుటుంబలను ప్రభుత్వం ఈ ఆగస్టు15 లోపు గుర్తించాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం రంపచోడవరం కేంద్రం గా కారం తమ్మన్నా పేరు తో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలిఅన్నారు అలాగే ఏజెన్సీ ప్రాతం లో అక్రమ కట్టడాలును వెంటనే తొలగించాలి లేదంటే మేము ప్రజా ప్రయోజన వాజ్యం న్యాయస్థానo లో పెడతామనీ అయన పేర్కొన్నారు నేటి తరం యువత హక్కులు కావాలి అంటే బాధ్యత లు కూడా తీసుకోవాలని అన్నారు ఈ సభ లో ఆదివాసీ ఉద్యోగ జేఏసీ నాయకులు సోడి నారాయణ,తొడం.దేశయ్య,సున్నం.వెంకటేశ్వర్లు,గొర్రె బిక్షం కుర్సం.పకీర్ దొర,జేఏసీ నాయకులు కాకా.సీతరామయ్య.కారం చందు,ముచ్చిక బాలకృష్ణ, కొమరం భీమ్ యూత్ అధ్యక్షులు పొడియం రమేష్, ముచ్చిక వినోద్ కుమార్,కాక నాగేశ్వరావు,fbo, భవాని,సవలం రవి, సొడే బాబురావు, చట్టి పేసా కార్యదర్శి పొడియం రామకృష్ణ, బాబు శ్రీను,తదితరులు పాల్గొన్నారు.
