
ఆలయం వద్ద యజ్ఞం నిర్వహిస్తున్న దృశ్యం..
రుద్రూర్, మార్చ్ 10 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండలంలోని
అంబం (ఆర్) గ్రామంలో దక్షిణముఖి ఆంజనేయస్వామి ఆలయ విగ్రహ శిఖర ప్రతిష్టాపన మహా కుంభాభిషేకం వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఆలయం వద్ద స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు దంపద జంటలు యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని, స్వామి వారికీ ప్రత్యేక పూజలు చేపట్టారు. మూడు రోజుల పాటు యజ్ఞ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. అలాగే మంగళవారం రోజున శ్రీ శ్రీ శ్రీ విరూపాక్ష విద్యారణ్యస్వామి హంపి పీఠాధిపతిచే అనుగ్రహ ప్రవచనం ఉంటుందన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.