
షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”
షాద్ నగర్ ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష
సమీక్షా సమావేశానికి హాజరైన అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వాలని ఆదేశాలు
రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
( పయనించే సూర్యుడు ఆగస్టు 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ నియోజక వర్గ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అధికారులను ఆదేశించారు. మంగళ వారం షాద్ నగర్ ఆర్డీవో కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశానికి రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, ఆర్డీవో ఎన్ఆర్ సరిత తదితర స్థానిక అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను మరో 15 రోజుల్లో పూర్తిగా పరిష్కరించాలని ఏ ఒక్కటికూడా పెండింగ్ ఉండొద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా రేషన్ కార్డుల విషయంలో అధికారులు మీనామేశాలు లెక్కించకుండా అవసరమైతే ఇతర పనులను పక్కనపెట్టి వెంటనే రేషన్ కార్డుల సర్వే ప్రక్రియతో పాటు అన్ని విషయాలను గ్రహించి వాటిని మూడు వారాల లోపల పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారికి వెంటనే కార్డులు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా గత రెవెన్యూ సదస్సులకు సంబంధించి షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 3,105 దరఖాస్తులు వచ్చినట్లు సమీక్ష సమావేశాలు అధికారులు ఎమ్మెల్యే దృష్టి తెచ్చారు. ఇందులో 1,937 అప్రూవ్ అయ్యాయని మిగతా 1183 డిజెక్టేడ్ అయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటికీ 548 దరఖాస్తులు పరిశీలించి పూర్తిచేసినట్టు అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. కొన్ని సాంకేతిక కారణాలవల్ల పూర్తయిన పనులు కూడా పెండింగ్లో ఉన్నట్లు భూభారతిలో కనిపిస్తున్నాయని ఈ సందర్భంగా అధికారులు ఎమ్మెల్యే తీసుకువచ్చారు. రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లాకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులు ఏవి ఉండకూడదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ అధికారులకు ఆదేశించారు. మిగతా పనులు ఏవైనా ఉంటే వాటిని పక్కన పెట్టాలని ముందుగా రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల కోసం చేపట్టిందని వాటిలో నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులకు ఎమ్మెల్యే కరాకండిగా సూచించారు. అదేవిధంగా రెవెన్యూ పరిపాలన పరమైన విషయాలను ఈ సమీక్ష సమావేశంలో అధికారులతో ఎమ్మెల్యే శంకర్ చర్చించారు. పలు ప్రభుత్వ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.
