
స్వార్థ పూరితమైన నాయకులని గమనించాలి.
వెంకటాపురం కాంగ్రెస్ ఎస్ సి. సెల్ అధ్యక్షుడు, సాధనపల్లి శ్రీనివాస్.
పయనించే సూర్యుడు: ఏప్రిల్ 02:ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.
నూగూరు వెంకటాపురం: మంగళవారం వెంకటాపురం లో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీఎస్సీ సెల్ అధ్యక్షులు సాధన పెళ్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ మండలంలో ఉన్నటువంటి దళితులందరూ సమావేశమై గవర్నమెంట్ దళితుల కోసం ప్రవేశపెట్టిన అటువంటి దళిత బందును ఉద్దేశించి కొంతమంది స్వార్థం కోసం మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం జరిగిందని తెలిపారు .దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మండలంలో ఉన్న దళితులం అందరం ఏకమై ఈరోజు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద సమావేశం అయి మేము ఎవరికీ ఒక రూపాయి ఇవ్వలేదు వెంకటాపురం కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాని పెద్దలకు గాని ఎవరికి ఒక్క రూపాయి ఇయ్యలేదు అని చెప్పేసి అని విలేకరుల సమావేశం విలేకరుల సమావేశంలో దళిత సంఘాల నాయకులు తెలియజేయడం జరిగిందని వివరించారు.అగ్రవర్ణాలు వాళ్ల స్వార్థం కోసం దళితులకు దళితులకు మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతోటి గొడవలు పెట్టే విధంగా చేస్తూ మా దళితుల మధ్య ఐక్యత లేకుండా చేయడం కొరకు కుట్రలు వండుతున్నారని కావున అగ్రవర్ణ నాయకులారా ఖబర్దార్ దయచేసి మా దళితుల్ని విడగొట్టే ప్రయత్నం చేయొద్దని ,మేము ఎవరికీ ఎవరికి రూపాయి ఇవ్వలేదు కాబట్టి మాకు మాకే చిచ్చులు పెట్టి మాకు గొడవలు పెట్టి మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం మీ స్వలాభం కోసం అధ్యక్షునిగా ఖండిస్తున్నానని ఇట్లు సాధన పెళ్లి శ్రీనివాస్ మీడియా సమావేశం లో వెల్లడించారు.