
పయనించే సూర్యడు // మార్చ్ // 17 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్//కుమార్ యాదవ్..
హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో దళిత బందు రెండవ విడత నిధులు రావడానికి కృషి చేసిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబుకు దళిత బంధు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం నాడు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రణవ్ బాబు ను కలిశారు. ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ.. ఎలాంటి ఆంక్షలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో మాట్లాడి నిధుల విడుదలకు కృషి చేశామని, గతంలో జరిగిన అవకాతవకలకు ఎలాంటి అవకాశం లేకుండా పకడ్బందీగా అమలు చేశామని అన్నారు. దళారీ వ్యవస్థకు అవకాశం లేకుండా అమలు చేస్తున్నామని తెలిపారు. దీనిపై ఇప్పటికే సంబంధిత అధికారులకు సూచనలు చేశామని తెలిపారు. దీంట్లో భాగంగా డైరీ ఫాం యూనిట్ లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అన్నారు.
