
భారత్ సైన్యం రాత్రి ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు
ఇది కేవలం ట్రయల్ మాత్రమే… ముందుంది మొసళ్ళ పండుగ
ఉగ్రవాద చర్యలను ఉపేక్షించేది లేదని భారత సైన్యం నిరూపించింది
వంశీ కృష్ణ బీజేవైఎం రాష్ట్ర నాయకులు
జమ్మూ కాశ్మీరు లో పహాల్గం లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 27 మంది చనిపోయారు. అందుకు ప్రతీకారంగా రాత్రి భారత్ సైన్యం మరియు వైమానిక దళం ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు జరిపారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఆరు చోట్ల మరియు పాకిస్థాన్ లో మూడు చోట్ల ప్రతీకార చర్య గా ఆపరేషన్ సింధు పేరుతో దాడులు జరిపారు.ఇది కేవలం ట్రయల్ మాత్రమే… ముందుంది మొసళ్ళ పండుగ, భారత్ తో పెట్టుకుంటే ప్రతీకార చర్య ఎలా వుంటుందోఅని భారత ప్రభుత్వ నిరూపించింది. ఉగ్రవాద చర్యలను ఉపేక్షించేది లేదని భారత సైన్యం నిరూపించింది. ఈ చర్య పట్ల యావత్తూ భారత్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూ, ప్రధాని నరేంద్రమోదీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.