
పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కూకట్ పల్లీ శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం నందు నూతనంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ వేదిక ప్రారంభోత్సవంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర రావు, శ్రీ దాసాంజనేయ స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న రాజేశ్వరరావు నీ ఆలయ అర్చకులు వేదఆశీర్వచనలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,ఎమ్మెల్సీ కురుమయ్య నవీన్ రావు,కురుమయ్య కొండలరావు గొట్టుముక్కల వెంగళరావు కురుమయ్య నర్సింగ్ రావు రామాలయం చైర్మన్ తులసి రావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు