
ఎస్సై ముత్యాల శ్రీనివాసులు
పయనించే సూర్యుడు అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె అక్టోబర్ 21 ; మండల పరిధిలోని ఎగువన ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా పింఛ ప్రాజెక్ట్ లోకి నీరు అధికంగా చేరడంతో రెండు గేట్లు ద్వారా నీరు దిగువకు విడుదల చేశారు. ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులు మాట్లాడుతూ.. దిగువ ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే చెయ్యేరు నది పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగులు దాటకూడదని ముఖ్యంగా ఈతకు వెళ్లవద్దని, రైతులు తమ పశువులను మేతకు నది ఇరువైపుల తీసుకెళ్లరాదని ఆయన సూచించారు.