
పయనించే సూర్యుడు నవంబర్ 5,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
వేలాదిగా తరలివచ్చిన భక్తులు.-ఆలయ ఈవో యం.రామక్రిష్ణ.
ప్రముఖ శైవక్షేత్రం నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు బుధవారం నిర్వహించిన సామూహిక వడిబియ్యం కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు కంపమల్ల పుల్లయ్య స్వామి, నారాయణస్వామి, వీరస్వామి, కార్యనిర్వాహణాధికారి రామక్రిష్ణ ఆధ్వర్యంలో పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్సై నరేంద్రనాథ్ రెడ్డి, గ్రామ పెద్దలు మరియు ప్రజల సహకారంతో సంతానలేని మహిళలకు సామూహిక వడి బియ్యం కార్యక్రమము నిర్వహించబడినది. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుండి యేగాక ఇతర రాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు, వచ్చిన భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని అభిషేకములు, అర్చనలు, విశేష పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకొన్నారు. అనంతరం కళ్యాణ మంటపము నందు సంతాన లక్ష్మి పూజ నిర్వహించి సంతానము లేక హాజరైన సుమారు 4 వేలు మందికి చీర, సారెతో ఉచితంగా ఇవ్వబడిన బియ్యము పోసి సంతాన లక్ష్మి పూజ చేయించి వేదమంత్రములతో ఆశీర్వదించారు. అనంతరం హాజరైన భక్తులందరికీ అన్న ప్రసాదము వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మిలిటరీ సుబ్బారెడ్డి, శివరామిరెడ్డి, సుబ్బారెడ్డి, రామసుబ్బారెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి, నాగేశ్వరరావు, ఎన్సిసి విద్యార్థులు, వివిధ సేవకులు, గ్రామ ప్రజలు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

