Thursday, June 12, 2025
Homeఆంధ్రప్రదేశ్దివ్యాంగులకు సహాయ ఉపకరణముల కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ

దివ్యాంగులకు సహాయ ఉపకరణముల కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ

Listen to this article

జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనిన

పయనించే సూర్యుడు జూన్ 10 (పొనకంటి ఉపేందర్ రావు )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దివ్యాంగులకు సహాయ ఉపకరణాల కొరకు అర్హులైన వారి నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనిన పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు . రిట్రో ఫిట్టేడ్ మోటార్ వాహనాలు 51, బ్యాటరీ వీల్ చైర్లు 15 , మొబైల్ బిజినెస్ బ్యాటరీ వీల్ చైర్లు20 , బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో 1 , హైబ్రిడ్ వీల్ చైర్ 5 , లాప్టాప్స్ 23 , టాబ్స్ 13 , 5G స్మార్ట్ ఫోన్ 3 మరియు ట్రై సైకిల్ వీల్ చైర్లు వినికిడి యంత్రాలు కొరకు ఆన్లైన్ ద్వారా https://tgobmms.cgg.gov.in దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు, అర్హతను అనుసరించి సహాయ ఉపకరణముల కొరకు ఈనెల 18లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చేసుకున్న దరఖాస్తులను జిల్లా సంక్షేమ శాఖ అధికారి మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం IDOC , గ్రౌండ్ ఫ్లోర్ 1 నందు దరఖాస్తులు అందించవలసిందిగా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు ఇతర వివరముల కొరకు
63019 81960 83310 06010.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments