
వికలాంగుల రాజ్యాధికార సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బిజ్వార్ నగేష్ గౌడ్
పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి 26//నారాయణపేట జిల్లా (మక్తల్) గత 14 సంవత్సరాల నుండి వివిధ హోదాల్లో పని చేస్తూ దివ్యాంగుల సంక్షేమ శాఖను విస్మరిస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న దివ్యాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ కి శైలజ తక్షణమే సస్పెండ్ చేసి అరెస్టు చేసి ఆమె నుండి అవినీతికి పాల్పడిన దాదాపు 40 కోట్ల రూపాయలు రికవరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు మంగళవారం ఉట్కూరులో ఏర్పాటు చేసిన విలేఖ సమావేశంలో నాగేష్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఉన్నటువంటి అనేక కులాలు, మతాలు జాతులలో వెనుకబడిన జాతి ఏదైనా ఉంది అంటే అది ఒక వికాలంగా జాతి మాత్రమే కాళ్లు కళ్ళు చేతులు లేక అన్నము రామచంద్ర అంటున్న మా కొరకు గత ప్రభుత్వం ఇచ్చిన అరకొర నిధులు కూడా దాదాపు 40 కోట్ల పైగా అవినీతి జరగడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అవినీతి వెనుక గత పాలకుల హస్తం కూడా ఉందని ఈమెను అరెస్టు చేస్తే అందరూ బయటకు వస్తారని అన్నారు
గతంలో దాదాపు 45 వేల మోటార్ సైకిల్ కొనుగోలు కొనుగోలు చేస్తే అవి ఎవరికి ఇచ్చిన లబ్ధిదారుల వివరాలు కూడా వెబ్సైట్లో పెట్టకపోవడం చూస్తే ఇది అవినీతికి పాల్పడినట్లేనని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ శాఖకు సంబంధించిన ఫైల్స్ అన్ని దాదాపు 90% వరకు మాయం చేసిన ఘనత శైలజ కే దక్కుతుందని అన్నారు ముత్తినేని వీరయ్య చెప్పడం వెనుక నిజం ఉందని అన్నారు కావున ఈమె తక్షణమే అరెస్టు చేసి ఈమె స్థానంలో నూతనంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ నియమించి ఇప్పటికైనా మా సంక్షేమ శాఖలో అసలైన దివ్యాంగులకు న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు