Sunday, July 27, 2025
Homeఆంధ్రప్రదేశ్దిశా కమిటీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఇల్లందుఎమ్మెల్యే కోరం

దిశా కమిటీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఇల్లందుఎమ్మెల్యే కోరం

Listen to this article

క్షేత్రస్థాయిలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి..

ప్రజా ప్రతినిధుల ప్రతిపాదనలు సకాలంలో పూర్తి చేయాలి..

వర్షాకాలంలో ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సహాయం అందించాలి

ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురామిరెడ్డి
.
పయనించే సూర్యుడు జులై 26 పొనకంటి ఉపేందర్ రావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాప్రజా ప్రతినిధులు చేసిన ప్రతిపాదనను సకాలంలో పూర్తి చేయాలని, పనులకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రెడ్డి అన్నారు. శనివారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దిశా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత అక్టోబర్లో నిర్వహించిన దిశా కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, పనుల పురోగతిపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు తప్పకుండా అమలు చేయాలని పనులను త్వరితగతను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, పాము కాటు గురి అయ్యే వారికి కావలసిన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోని పట్వారి గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో అంబులెన్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత లేకుండా అవసరమైన సిబ్బందిని నియమించాలని అన్నారు. గుండాల మండలం లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు ఆసుపత్రిని ముప్పై పడకల ఆసుపత్రిగా అభివృద్ధి పరచాలన్నారు. సీజనల్ వ్యాధులు అయినటువంటి మలేరియా,డెంగ్యూ, అతి సార ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.నేషనల్ హైవే ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్ల నిర్మాణం పై అధికారులు సరైన నివేదికలు ఇవ్వకుండా పనులు జాప్యం చేయడంపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులకు తగిన సమాచారం అందించాలని దాని ద్వారా పనులు త్వరితగతిన పూర్తి చేయగలమని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ రామ సహాయం రెడ్డి పనులు పూర్తి చేయడంలో విఫలమైన కాంట్రాక్టర్లను గుర్తించి వారిని బ్లాక్ లిస్ట్ పెట్టాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో శిధిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలు, అంగన్వాడీ భవనాలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను త్వరితగతిన తొలగించి నూతన భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీలో వృద్ధులు వేలిముద్రలు పడకుండా ఇబ్బందులకు గురవుతున్నారని, కావున ప్రతి ఒక్క రేషన్ షాప్ నందు కౌంటర్లు ఏర్పాటు చేసి రేషన్ కార్డుకు ఫోన్ నెంబర్ అనుసంధానం చేయడం ద్వారా బియ్యం పంపిణీ చేయాలని ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా నూతనంగా రేషన్ కార్డులు పంపిణీ ద్వారా రేషన్ కార్డుల సంఖ్య పెరిగిందని దానికి అనుగుణంగా రేషన్ షాపులను పెంచాలని దాని ద్వారా నిరుద్యోగులకు అవకాశం దొరుకుతుంది అన్నారు.ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు మంజూరులో అలసత్వం ప్రదర్శిస్తే వారి పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల నిధులు మంజూరు చేయడంలో క్షేత్రస్థాయిలో ఆధార్ నెంబర్లు తప్పుగా నమోదు చేయడం వలన కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ సమీక్షలో భాగంగా రైల్వే, బిఎస్ఎన్ఎల్, ఉపాధి హామీ పథకం, ఇంజనీరింగ్ తదితర శాఖల ద్వారా చేపడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలపై చర్చించారు. పాఠశాలలో ప్రహరీ గోడల నిర్మాణం ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ నూతన పద్ధతి ద్వారా మట్టి ఇటుకలతో ప్రహరీ గోడలు నిర్మించవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.ఆర్టికల్ 279 ద్వారా భవన నిర్మాణాలు, అదనపు తరగతి గదులు, రోడ్లు మంజూరు వంటి ప్రతిపాదనను అందజేయాలని కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్ , భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన మరియు అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments