రుద్రూర్, అక్టోబర్ 29(పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
రుద్రూర్ మండల కేంద్రంలోని పలు దుకాణ సముదాయాలను బుధవారం తూనికల శాఖ అధికారి ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఏదైనా వస్తువు ఎంఆర్ పి ధరల కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే దుకాణ యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయాని దుకాణ యజమానులకు ఆయన సూచించారు. ఈ తనిఖీలలో కానిస్టేబుల్ నరేష్ తదితరులు ఉన్నారు.


