
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 26
దేవరాపల్లి అసరాడ బిటీ రోడ్డు మరమత్తులు చేయించాలని,సీలేరులో పోస్ట్ మార్టమ్ రూమ్ ఏర్పాటు చేయాలని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు ఆంధ్ర ప్రదేశ్ జిల్లా చైర్మన్ రామారావుదొర పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరమణి శ్రీ పూజాని,అసిస్టెంట్ కలెక్టర్ కనలా చిరంజీవి నాగ వెంకట సాహిత్ ని కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు.జికె వీధి మండలం దేవరాపల్లి పంచాయతీ దేవరాపల్లి గ్రామం నుండి అసరాడ గ్రామం వరకు గత 15 సంవత్సరాల క్రితం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేసిన బిటి రోడ్డు (తారు రోడ్డు)పూర్తిగా చిదిలమై పోయిందని,ఆ రోడ్డు మీదుగా దేవరాపల్లి,లక్కవరపుపేట పంచాయతీ ప్రజలు నిత్యం ప్రయాణం చేస్తున్నారధి.చిదిలమైన రోడ్డు కారణంగా ఆ రెండు పంచాయతీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రోడ్డు మరమత్తులు(పేచ్ వర్క్)చేయించగలరని కోరారు.అసిస్టెంట్ కలెక్టర్ ని కలిసి మండలం లో గల సీలేరు, దారకొండ ప్రాంతానికి 70 కిలోమీటర్లు దూరంలో ఉన్న చింతపల్లిలో పోస్టుమార్టం రూమ్ ఉండడంవల్ల సీలేరు సమీపంలో ఉన్న 6 పంచాయతీలు ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.సీలేరు, దారకొండ ప్రాంతంలో యాక్సిడెంట్ల వల్ల గాని ప్రమాదవశాత్తు గాని, ఎవరైనా ఆత్మహత్యలు చేసుకొని మరణించినా కాని పోస్టుమార్టం చేయించుకోవాలంటే సుమారుగా రెండు, మూడు రోజులు టైం పడుతుంది. దీనివల్ల సంబంధించిన కుటుంబాలు మానశికంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు.అలాగే బోగస్ కుల ధృవీకరణ పత్రాలు పొందిన వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు.ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఏసి ఇంటలెక్సవల్ మెంబర్ నర్సి పాపారావు,గిరిజన విద్యార్థి సంఘం నాయకులు బాబి,మాదవరావు,అనిల్,శంకర్,రవి తదితరులు పాల్గొన్నారు.
